అర్హులందరికీ పథకాలు: మంత్రి అచ్చెన్న
ABN , Publish Date - Jan 25 , 2025 | 12:10 AM
అర్హత ఉన్న ప్రతి ఒక్కరికీ ప్రభుత్వ పథకాలు అందిస్తా మని రాష్ట్ర వ్యవసా యశాఖ మంత్రి కింజరాపు అచ్చె న్నాయుడు అన్నారు.

కోటబొమ్మాళి, జనవరి 24 (ఆంధ్రజ్యోతి): అర్హత ఉన్న ప్రతి ఒక్కరికీ ప్రభుత్వ పథకాలు అందిస్తా మని రాష్ట్ర వ్యవసా యశాఖ మంత్రి కింజరాపు అచ్చె న్నాయుడు అన్నారు. శుక్రవారం పార్టీ కార్యాలయం లో ప్రజల నుంచి వినతులు స్వీకరించారు. జిల్లా లోని వివిధ ప్రాంతాల నుంచి ప్రజలు వచ్చి సమస్య లపై వినతిపత్రాలు అందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లా డుతూ.. వీలున్నంత త్వరగా ప్రజలకు మేలు చేసేలా సత్వర చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. విధులలో అలసత్వం వహించవద్దన్నారు. ఉద్యోగ, ఉపాధి అవకాశాల కల్పన, మెరుగుదలే ఽధ్యేయంగా కూటమి ప్రభుత్వం పనిచేస్తుందన్నారు. నూతన గృహాలు, పింఛన్లు, ఉపాధి అవకాశాలు, రహ దారు లు మంజూరు చేయాలని ప్రజలు కోరారు. గ్రామా ల్లో మౌలిక సదుపాయాలు కల్పించేందుకు అవస రమైన నిధులున్నాయని, సకాలంలో పనులు పూర్తి చేయాలని అధికారులకు అదేశించారు. మండలా నికి చెందిన నలుగురు క్షేత్ర సహాయకులకు నియా మక పత్రాలు అందజేశారు. కార్య క్రమంలో పీఏ సీఎస్ మాజీ అధ్యకుడు కింజరాపు హరివర ప్రసాద్, టీడీపీ మండల అధ్యక్షుడు బోయిన రమేష్, పలు శాఖల అధికారులు పాల్గొన్నారు.