Sankranti holidays: నేటి నుంచి పాఠశాలలకు సంక్రాంతి సెలవులు
ABN , Publish Date - Jan 10 , 2025 | 12:09 AM
Sankranti holidays: ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలకు ప్రభుత్వం సంక్రాంతి సెలవులను ప్రకటించింది. శుక్రవారం నుంచి ఈ నెల 19 వరకు సంక్రాంతి సెలవులు ఉంటాయి.
టెక్కలి, జనవరి 9 (ఆంఽధ్రజ్యోతి): ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలకు ప్రభుత్వం సంక్రాంతి సెలవులను ప్రకటించింది. శుక్రవారం నుంచి ఈ నెల 19 వరకు సంక్రాంతి సెలవులు ఉంటాయి. ఈ నేపథ్యంలో గురు వారం పాఠశాలల్లో సంక్రాంతి సంబరాలు నిర్వహించారు. అనంతరం విద్యార్థులు ఇళ్ల బాట పట్టారు. జిల్లాలో ఒకటి నుంచి పదో తరగతి వరకు ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల్లో సుమారు 3 లక్షల 20వేల మంది విద్యార్థులు చదువుతున్నారు.
విద్యార్థుల కోసం ప్రణాళిక..
విద్యా శాఖ యంత్రాంగం ఈసారి సంక్రాంతి సెలవుల్లో ఆసక్తి ఉన్న విద్యార్థులకు వివిధ అంశాలపై అవగాహన కల్పించనున్నట్టు జిల్లా విద్యాశాఖాధికారి తిరుమల చైతన్య తెలిపారు. భోగి, సంక్రాంతి, కనుమ రోజులు మినహా మిగిలిన రోజుల్లో ఆసక్తి గల విద్యార్థులకు కార్యక్రమాలు రూపొందించారు. ఆరు నుంచి తొమ్మిదో తరగతి చదువుకునే విద్యార్థులు ముఖ్యమంత్రికి, మంత్రులకు, ఎమ్మెల్యేలకు, జిల్లా ఉన్నతాధికారులకు ఇలా ఎవరికైనా ఏదైనా ఒక సామాజిక సమస్యపై లేఖ రాయవలసి ఉంటుంది. పండుగకు ఏ ఊరు వెళ్లారు? ఆ ఊరి విశేషాలేమిటి? అన్న అంశాలను కూడా విద్యార్థులు పాఠశాల తెరిచిన సమయంలో రాసి.. అందించవచ్చున న్నారు.
బయాలజీ, ఇతర ముఖ్య సబ్జెక్టులకు సంబంధించి ఔట్‌లైన్ మ్యాప్ పాయింట్లను విద్యాశాఖ యంత్రాంగం విద్యార్థులకు ముందుగా అందించనుందన్నారు. విద్యార్థులు మ్యాప్ పాయింట్లు గుర్తించగలగాలి. సుమారు 25 మ్యాప్ పాయింట్లు గుర్తించగలిగితే ఉత్తీర్ణతకు దోహదపడు తుందన్నారు. సంసిద్ధం వ్యక్తం చేసిన పదో తరగతి విద్యార్థులకు సం బంధించి ఆఫ్‌లైన్, ఆన్‌లైన్ క్లాసులు నిర్వహించవచ్చన్నారు. ఈ విష యంలో ఉపాధ్యాయులు, విద్యార్థులకు బలవంతం లేదన్నారు. ప్రతి విద్యా ర్థికి సెల్ఫ్‌ఎసెస్‌మెంట్ ఫారం కూడా అందజేస్తున్నామని తెలిపారు.
సంక్రా ంతి సెలవుల్లో ఎనిమిది మార్కుల ప్రశ్నలు, నాలుగు మార్కుల ప్రశ్నలు, రెండు మార్కులు, ఒక మార్కు ప్రశ్నలకు ఆయా సబ్జెక్టుల్లో నేర్చుకోవడం, బడులు తెరచిన తరువాత ఏమి నేర్చుకున్నారో తెలుసుకోవడం విద్యాశాఖ వంతు కానుందన్నారు. విద్యార్థులను ఎ,బి,సి,డిలుగా విభజిస్తామన్నారు. సీ డీ విభాగాల్లో ఉన్న విద్యార్థులకు దత్తత తీసుకుంటారని వివరించారు. అవసరమైతే ఉపాధ్యాయులు ఆ విద్యార్థుల గృహసందర్శన, యోగ క్షేమాలతో పాటు అవగాహన కల్పిస్తామని డీఈఓ తెలిపారు.
చర్యలు తప్పవు..
ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలు కచ్చితంగా సెలవులు అమలు చేయా ల్సిందేనని స్పష్టం చేశారు. పాఠశాలలు తెరిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు.