Sankranthi : సంక్రాంతి సందడి
ABN , Publish Date - Jan 16 , 2025 | 12:11 AM
Sankranthi :జిల్లాలో సంక్రాంతి సంబరాలు ఘనంగా జరిగాయి. మం గళవారం సంక్రాంతిని, బుధవారం కనుమను జిల్లా ప్రజలు జరుపుకొన్నారు.

జిల్లాలో సంక్రాంతి సంబరాలు ఘనంగా జరిగాయి. మం గళవారం సంక్రాంతిని, బుధవారం కనుమను జిల్లా ప్రజలు జరుపుకొన్నారు. వేకువజాము నుంచే గ్రామాల్లో సందడి నెలకొంది. పురోహితులు, జంగమదేవరులు ప్రతి ఇంటికీ వెళ్లి పెద్దలను పొగిడారు. కుల పేరంటాళ్లు గుండాలకు వెళ్లి ఆయా కుంటుబీకులు భక్తిశ్రద్ధలతో మొక్కుల తీర్చుకున్నారు. పెద్దలకు నూతన వస్త్రాలు, మడపల్లను చెల్లించుకున్నారు. హరిదాసుల కీర్తనలు, డూడూ బసవన్నల ఆటలు, ఆకాశంలో గాలిపటాలు, కొత్త దుస్తుల్లో చిన్నారులు, యువత కనిపించి కనువిందు చేశారు. చుట్టాలు, బంధువుల రాకతో గ్రామాల పరిసరాలన్నీ కొత్తదనాన్ని సంతరించుకున్నాయి. కనుమ పండగ సందర్భంగా గోపూజను నిర్వహించారు. ఎమ్మెల్యే నడుకుదిటి ఈశ్వరరావు తన స్వగ్రామం బంటుపల్లిలో జరిగిన సంక్రాంతి సంబరాల్లో కుటుంబ సమేతంగా పాల్గొన్నారు. ముగ్గుల పోటీలు, యువతకు ఆటల పోటీలు నిర్వహించి విజాతలకు బహుమతులు అందజేశారు.
-ఆంధ్రజ్యోతి బృందం