Saffron worship భక్తిశ్రద్ధలతో కుంకుమ పూజలు
ABN , Publish Date - Feb 07 , 2025 | 11:40 PM
Saffron worship నర్శింగపల్లిలో శ్రీ కోదండరామ ఆలయ ప్రారంభం, విగ్రహ ప్రతిష్ఠ కార్యక్ర మంలో భాగంగా శుక్రవారం సామూహిక కుంకుమపూజలు నిర్వహించారు.

టెక్కలి, ఫిబ్రవరి 7(ఆంధ్రజ్యోతి): నర్శింగపల్లిలో శ్రీ కోదండరామ ఆలయ ప్రారంభం, విగ్రహ ప్రతిష్ఠ కార్యక్ర మంలో భాగంగా శుక్రవారం సామూహిక కుంకుమపూజలు నిర్వహించారు. అర్చకులు శతపతి ప్రసాద్‌శర్మ ఆధ్వర్యంలో పురోహితులు రుద్రాభిషేకం, ధాన్యాధివాసం, హోమాది కార్య క్రమాలు, వేద పారాయణం చేప్టారు. సామూహిక కుంకుమ పూజల్లో పెద్ద ఎత్తున మహిళలు పాల్గొన్నారు. శనివారం స్వామి విగ్రహ ప్రతిష్ఠ చేపడుతున్నట్లు నిర్వాహకులు తెలి పారు. కార్యక్రమంలో పోలాకి షణ్ముఖరావు, రౌతు జయ మోహన్, రట్టి మణి, తిరుపతిరావు, ఆదినారాయణ, బైరాగి, శంకర్, లచ్చుమయ్య తదితరులు పాల్గొన్నారు.
కల్యాణోత్సవాలు ప్రారంభం
నందిగాం, ఫిబ్రవరి 7(ఆంధ్రజ్యోతి): సుబ్బ మ్మపేటలో కొలువై ఉన్న లక్ష్మీనరసిం హ స్వామి కల్యాణోత్సవాలు శుక్ర వారం ఘనం గా ప్రారంభమయ్యాయి. ఆలయ వంశపారం పర్య ధర్మకర్త కె.రంగనాథన్ ఆధ్వర్యంలో ప్రముఖ వేదపండితులు చామర్తి శ్రీనివాసా చార్యులు, ఆలయ అర్చకుడు కె.రామానుజా చార్యులు, రుత్వికుల ఆధ్వర్యంలో విశేష పూజ లు చేపట్టారు. భీష్మ ఏకాదశి సందర్భంగా శనివారం స్వామివారికి కల్యాణం నిర్వహి స్తున్నట్లు నిర్వాహకులు తెలి పారు. భక్తులు పాల్గొని స్వామి కృపకు పాత్రులు కావాలని కోరారు.
ఘనంగా ఆలయ వార్షికోత్సవం
హరిపురం, ఫిబ్రవరి 7 (ఆంధ్రజ్యోతి): డిమిరియా గ్రా మంలో ఆంజనేయస్వామి ఆలయ మొదటి వార్షికోత్సవం శుక్రవారం ఘనంగా నిర్వహించారు. స్వామికి ప్రత్యేక పూజ లు, అభి షేకాలు చేపట్టారు. గ్రామంలో స్వామి ఉత్సవ విగ్ర హాన్ని ఊరిగేంచారు. మధ్యాహ్నం అన్న సమారాధన చేప ట్టారు. స్వామిని ఎమ్మెల్యే గౌతు శిరీష దర్శించుకొని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. కార్యక్రమంలో టీడీపీ నేతలు బావన దుర్యోధన, రట్టి లింగరాజు, గ్రామస్థులు ముంజేటి చంద్రశేఖర్, పల్లి చంద్రయ్య, లక్ష్మీనారాయణ పాల్గొన్నారు.