Share News

RTC drivers డ్రైవర్ల వల్లే ఆర్టీసీలో సురక్షిత ప్రయాణం

ABN , Publish Date - Jan 25 , 2025 | 12:20 AM

ఆర్టీసీ బస్సుల్లో ప్రయా ణం అత్యంత సు రక్షితమని, అందు కు నిపుణులైన డ్రైవర్లే కారణమని జిల్లా ప్రజా రవా ణాధికారి విజయ కుమార్‌ అన్నారు.

RTC drivers  డ్రైవర్ల వల్లే ఆర్టీసీలో సురక్షిత ప్రయాణం
డ్రైవర్లను అభినందిస్తున్న డీపీటీవో విజయకుమార్‌

అరసవల్లి, జనవరి 24(ఆంధ్రజ్యోతి): ఆర్టీసీ బస్సుల్లో ప్రయా ణం అత్యంత సు రక్షితమని, అందు కు నిపుణులైన డ్రైవర్లే కారణమని జిల్లా ప్రజా రవా ణాధికారి విజయ కుమార్‌ అన్నారు. ‘డ్రైవర్స్‌ డే’ సందర్భంగా శుక్రవారం ఆయన డ్రైవర్లకు గులాబీలు, చాక్లెట్లు పంచి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. విధి నిర్వహణలో ప్రతీ డ్రైవర్‌ ఎంతో ఏకాగ్రతతో వాహనాలను నడుపుతారని, నిరంతరం అప్రమత్తతతో విధులు నిర్వహించడం వల్లే ఆర్టీసీలో ప్రయాణం సురక్షితమనే నమ్మకం ప్రజల్లో ఏర్పడిందని కొనియాడారు. కార్యక్రమంలో అసిస్టెంట్‌ మేనేజర్లు వి.రమేష్‌, గంగరాజు, ఎల్‌ఎస్‌ నాయుడు, ట్రాఫిక్‌ ఇన్‌స్పెక్టర్‌ దక్షిణామూర్తి, సెక్యూరిటీ సిబ్బంది, సూపర్‌వైజర్లు, యూనియన్‌ ప్రతినిధులు, డ్రైవర్లు, కండక్టర్లు పాల్గొన్నారు.

Updated Date - Jan 25 , 2025 | 12:20 AM