4ఆర్ కాలువపై రోడ్డు తొలగింపు
ABN , Publish Date - Feb 07 , 2025 | 12:10 AM
భగీరధపురం సమీపంలో 4ఆర్ పిల్ల కాలువపై మట్టితో వేసిన రోడ్డును అధికా రులు తొలగించారు.

హిరమండలం, ఫిబ్రవరి 6(ఆంధ్రజ్యోతి): భగీరధపురం సమీపంలో 4ఆర్ పిల్ల కాలువపై మట్టితో వేసిన రోడ్డును అధికా రులు తొలగించారు. ఐదు నెలలుగా రోడ్డు వేసి అక్రమంగా ఇసుక రవాణా చేస్తున్నా అధికారులు స్పందించ లేదు. దీనిపై గురువారం ‘ఆంధ్ర జ్యోతి’లో ‘కాలువ కప్పేసి.. ఇసుక తరలింపు’ శీర్షికతో వచ్చిన కథనంతో పాటు రైతుల నుంచి వచ్చిన ఫిర్యాదులతో తహసీల్దార్ హనుమంతరావు స్పందించారు. ఆయన దగ్గరుండి సదరు కాలువ పై నిర్మించిన రోడ్డును తొల గించారు. కార్యక్రమంలో ఆర్‌ఐ ఉమా శంకర్, వీఆర్వో పాల్గొన్నారు.
ధాన్యం బస్తాల తొలగింపు
నందిగాం, ఫిబ్రవరి 6(ఆంధ్రజ్యోతి): నర్శిపురం గ్రామ పంచాయతీ కార్యాలయంలో నిల్వ చేసిన ధాన్యం బస్తాలను తొలగిం చారు. గురువారం ఆంధ్రజ్యోతిలో ‘పంచా యతీ కార్యాలయంలో ధాన్యం నిల్వ’ శీర్షికతో వచ్చిన కథనానికి ఎంపీడీవో టి.రాజారావు స్పందించారు. తక్షణం వాటిని తొలగించాలని పంచాయతీ కార్యదర్శి కె.కృష్ణారావు సూచించారు. ఆయన సంబంధిత వ్యక్తులను పిలిచి ఆ ధాన్యం బస్తాలను అక్కడి నుంచి బయటకు తరలించారు.