Share News

ఆలయ దర్శనం తరువాత తిరిగి వెళుతూ..

ABN , Publish Date - Feb 26 , 2025 | 11:51 PM

పోలాకి పంచాయతీ గంటపేట గ్రామంలోని ఓ కల్యాణ మండపం వద్ద బుధవారం జరిగిన రోడ్డు ప్రమా దంలో ఆటో బోల్తా పడి 14 మందికి గాయాలయ్యాయి..

ఆలయ దర్శనం తరువాత తిరిగి వెళుతూ..
ఘటనా స్థలం వద్ద క్షతగాత్రులు

పోలాకి, ఫిబ్రవరి 26(ఆంధ్రజ్యోతి): పోలాకి పంచాయతీ గంటపేట గ్రామంలోని ఓ కల్యాణ మండపం వద్ద బుధవారం జరిగిన రోడ్డు ప్రమా దంలో ఆటో బోల్తా పడి 14 మందికి గాయాల య్యాయి.. పోలీసులు, స్థాని కులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి.. సంతబొమ్మాళి మండలం కారిపేటకు చెందిన ఆటోలో 14 మంది పోలాకి మండలం గొల్లలవలస శివాలయానికి దర్శనం నిమిత్తం వచ్చారు. స్వామిని దర్శించుకుని తిరుగు ప్రయాణంలో గంటపేట వద్ద ఎదురుగా వస్తున్న కారును తప్పించపోయి ఆటో బోల్తా పడింది. దీంతో వారంతా గాయాలబారినపడ్డారు. గాయాలైన వారిలో ఐదుగురు పిల్లలున్నారు. క్షతగాత్రుల్లో ఇద్దరు మహిళలకు తల, కాలిపై బలమైన గాయాలు కావడంతో చికిత్స నిమిత్తం శ్రీకాకుళంలోని ఆసుపత్రికి తర లించారు. విషయం తెలిసిన వెంటనే పోలీసులు ఘటనా ప్రదేశానికి వెళ్లి క్షతగాత్రులను 108లో నరసన్న పేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. క్షత గాత్రులంతా కారిపేటకు చెందిన ఒకే కుటుంబానికి చెందిన వారిమని, తిరు గు ప్రయాణంలో ప్రమాదానికి గురయ్యామని పేర్కొన్నారు. అయితే పెద్ద ప్రమాదం జరగక పోవడంతో అందరూ ఊపిరిపీల్చుకున్నారు. ప్రమాదం జరిగిన వెంటనే స్థానికులు స్పందించి క్షతగాత్రులకు సపర్యలు చేశారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Updated Date - Feb 26 , 2025 | 11:51 PM