Share News

చెరువులో జారిపడి రిటైర్డ్‌ ఆర్మీ ఉద్యోగి మృతి

ABN , Publish Date - Feb 08 , 2025 | 11:47 PM

కాశీబుగ్గ రాధాకాంత చెరువులో ప్రమాదవశాత్తు జారిపడి వజ్రపుకొత్తూరు మండలం నగరంపల్లి గ్రామానికి చెందిన రిటైర్డ్‌ ఆర్మీ ఉద్యోగి చిగులపల్లి కోటేశ్వరరావు (45) శనివారం మృతి చెందారు.

చెరువులో జారిపడి రిటైర్డ్‌ ఆర్మీ ఉద్యోగి మృతి

పలాస, ఫిబ్రవరి 8(ఆంధ్రజ్యోతి): కాశీబుగ్గ రాధాకాంత చెరువులో ప్రమాదవశాత్తు జారిపడి వజ్రపుకొత్తూరు మండలం నగరంపల్లి గ్రామానికి చెందిన రిటైర్డ్‌ ఆర్మీ ఉద్యోగి చిగులపల్లి కోటేశ్వరరావు (45) శనివారం మృతి చెందారు. స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి.. కోటేశ్వరరావు కుటుంబంతో కలిసి కాశీబుగ్గలో ఉంటున్నారు. ఆంజనేయ స్వామి మాలధారణ చేసిన ఈయన సమీపంలో ఉన్న చెరువుకి స్నానానికి వెళ్లి అందులో దిగి గల్లంతయ్యాడు. దీనిని గమ నించిన స్థానికులు పోలీసులు, అగ్నిమాపక సిబ్బందికి సమా చారం ఇచ్చా రు. గజ ఈతగాళ్ల సాయంతో చెరువులో గాలించారు. సాయం త్రం ఐదు గంటల సమయంలో మృత దేహం తేలియాడుతుండగా స్థాని కులు గుర్తిం చారు. గజ ఈతగాళ్లు బయటకు తీశారు. కోటే శ్వరరావుకు భార్య నాగరత్నం, 8వ తరగతి చదువుతున్న కుమారుడు ఉన్నాడు. కోటేశ్వర రావు మృతితో గ్రామంలో విషాదం నెలకొంది. పంచనామా నిర్వహించి మృతదేహాన్ని పోస్టు మార్టం నిమిత్తం పలాస ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ పి.సూర్యనారాయణ తెలిపారు.
చెన్త్నెలో వలస కూలీ..
సంతబొమ్మాళి, ఫిబ్రవరి 8(ఆంధ్రజ్యోతి):
మర్రిపాడు పంచాయితీ శెలగ పేటకు చెందిన తామాడ సింహాచలం (54) చెన్నెలో మృతి చెందాడు. జీవ నోపాధి కోసం చెన్త్నె వలస వెళ్లిన సింహాచలం పైప్‌ లైన్‌ పని చేస్తున్నాడు. శనివారం పనిచేస్తుండ గా మట్టి జారిపడి అతనిపై పడడంతో మట్టి కింద ఉండిపోయి అక్కడిక్కడే మృతి చెందాడు. మృతుడికి భార్య, ఇద్దరు కుమారులున్నారు. సింహాచలం మృతితో గ్రామంలో విషాదఛాయలు అలముకున్నాయి.
చికిత్స పొందుతూ వ్యక్తి..
కోటబొమ్మాళి, ఫిబ్రవరి 8(ఆంధ్రజ్యోతి):
పట్టుపురం గ్రామానికి చెందిన గుడ్ల రామా రావు(55) శ్రీకాకుళం రిమ్స్‌లో చికిత్స పొందుతూ శనివారం మృతిచెందినట్లు ఎస్‌ఐ ఎ.వెంకటేశ్వరరావు తెలిపారు. ఆయన తెలిపిన వివ రాలిలా ఉన్నాయి.. రామారావు గతనెల 28న సాయంత్రం భార్య తవిట మ్మకు మద్యం సేవించేందుకు డబ్బులు అడిగాడు. ప్రతిరోజూ ఇలా నేను కూలి చేసి సంపాదించిన డబ్బులతో నీవు మద్యం తాగితే కుటుంబాన్ని ఎలా పోషిస్తామని మందలించింది. ఈ నేపథ్యంలో మనస్తాపానికి గురైన రామా రావు ఇంటి వెనకాల పొలం కోసం ఉంచిన పురుగుల మందును సేవిం చాడు. వెంటనే అటుగా వెళుతున్న కుమారుడు చూసి ఆ డబ్బాను తీసి పారవేసి విషయాన్ని తల్లికి చెప్పాడు. వెంటనే అతడిని తొలుత కోటబొ మ్మాళి సామాజిక ఆసుపత్రికి తరలించగా పరిస్థితి విషమించడంతో అక్కడి నుంచి మెరుగైన వెద్యం కోసం శ్రీకాకుళం రిమ్స్‌కు తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ మృతి చెందాడు. ఈ మేరకు భార్య ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ తెలిపారు.

Updated Date - Feb 08 , 2025 | 11:47 PM