Share News

'Rathasaptami' అధికారులకు ‘రథసప్తమి’ బాధ్యతలు

ABN , Publish Date - Jan 31 , 2025 | 12:10 AM

రాష్ట్ర పండగ అరసవల్లి సూర్యనా రాయణ స్వామివారి ‘రథసప్తమి’ వేడుకల నిర్వహణకు కీలక అధికారులకు బాధ్యతలను అప్పగిస్తూ ప్రభుత్వం చర్యలు చేపట్టింది.

'Rathasaptami'  అధికారులకు ‘రథసప్తమి’ బాధ్యతలు

శ్రీకాకుళం, జనవరి 30(ఆంధ్రజ్యోతి): రాష్ట్ర పండగ అరసవల్లి సూర్యనా రాయణ స్వామివారి ‘రథసప్తమి’ వేడుకల నిర్వహణకు కీలక అధికారులకు బాధ్యతలను అప్పగిస్తూ ప్రభుత్వం చర్యలు చేపట్టింది. విశాఖపట్నం దేవదా యశాఖ డిప్యూటీ కమిషనర్‌ ఎన్‌.సుజాత, విజయనగరం మాన్సాస్‌ ట్రస్ట్‌ డిప్యూటీ కమిషనర్‌ కేఎన్‌వీడీవీ ప్రసాద్‌, నిడదవోలులో తిమ్మరాజుపాలెం కొత్తమ్మ దేవస్థానం అసిస్టెంట్‌ కమిషనర్‌ వి.హరిసూర్యప్రకాష్‌, విజయనగరం పైడితల్లి దేవస్థానం అసిస్టెంట్‌ కమిషనర్‌ డీవీవీ ప్రసాదరావు, శ్రీకాకుళం దేవదాయశాఖ జిల్లా అధికారి బీఆర్‌వీవీ ప్రసాద్‌ పట్నాయక్‌ను ప్రభుత్వం కేటాయించింది. అలాగే ఇంజనీరింగ్‌ విభాగంలో కేవీవీ కృష్ణ(డీఈ-విశాఖ), టి.చందన (ఏఈ-శ్రీకాకుళం), కె.సాయి కృష్ణ (ఏసీ-విజయనగరం), సీహెచ్‌ గజపతిరావు (ఏఈఈ-పార్వతీపురం మన్యం), బి.వెంకటరమణ మూర్తి, ఆర్‌.ప్రవీణ్‌ చందు (టీఏ-శ్రీకాకుళం), టీవీ దుర్గాప్రసాద్‌ (సర్వేయర్‌-కన్సోలి డేటెడ్‌)లను రథసప్తమి ఏర్పాట్లను పర్యవేక్షించేందుకు నియమించారు. వీరితో పాటు జిల్లాలో పలు దేవాలయాల ఈవోలను ఇక్కడకు కేటాయించారు. వీరంతా శుక్రవారం నుంచి వచ్చే నెల 5వ తేదీ వరకు అరసవల్లిలోనే ఉంటూ విధులు నిర్వహించనున్నారు.

Updated Date - Jan 31 , 2025 | 12:10 AM