Share News

సమయపాలన పాటించండి: డీఎంహెచ్‌వో

ABN , Publish Date - Jan 30 , 2025 | 11:51 PM

వైద్యాధికారులు,సిబ్బంది సమయపాలన పాటించి రోగులకు మెరుగైన సేవలందించాలని డీఎంహెచ్‌వో బాలమురళీకృష్ణ ఆదేశించారు.

సమయపాలన పాటించండి: డీఎంహెచ్‌వో
పెద్దలంబలో కిడ్నీ రోగుల చీటీని పరిశీలిస్తున్న బాలమురళీకృష్ణ :

జలుమూరు (సారవకోట)జనవరి 30 (ఆంధ్రజ్యోతి): వైద్యాధికారులు,సిబ్బంది సమయపాలన పాటించి రోగులకు మెరుగైన సేవలందించాలని డీఎంహెచ్‌వో బాలమురళీకృష్ణ ఆదేశించారు. గురువారం సారవకోట మండలంలోని బొంతు పీహెచ్‌సీ తనిఖీచేశారు.ఈ సందర్భంగా రోగులకు నమ్మకం కలిగేలా వైద్యసేవలందించి ఓపీకి రోగుల హాజరు పెంచాలన్నారు.రోగులకు మాత్రలు ఇచ్చేటపుడు ఎక్సుపైర్‌ తేదీ చూసి పంపిణీ చేయాలన్నారు. అనంతరం పెద్దలంబ సందర్శించి కిడ్నీ రోగులతో మాట్లాడారు. పెయిన్‌ కిల్లర్‌ మాత్రలు అధికంగా వాడడం వల్ల కిడ్నీ సమస్యలు ఉత్పన్నమవుతున్నాయని, వైద్యుల సూచనలు మేరకే వాడాలని బాలమురళీకృష్ణ సూచించారు. గ్రామంలో 20 మంది వరకు కిడ్నీ రోగులు ఉన్నా, ఇద్దరు డయాలసిస్‌ చేయించుకుంటున్నట్లు గుర్తించారు. పీహెచ్‌సీలో కిడ్నీ సమస్యలకు సంబంధించిన మాత్రలు ఉంచడానికి కృషి చేస్తానన్నారు.కార్యక్రమంలో వైద్యాధికారులు సుస్మిత, సుధారాణి, సారవకోట వైద్యాధికారులు దేవిక పాల్గొన్నారు.

Updated Date - Jan 30 , 2025 | 11:51 PM