సమయపాలన పాటించాలి: ఏపీడీ
ABN , Publish Date - Feb 13 , 2025 | 11:37 PM
పనుల్లో సమయ పాలన పాటించడంతో పాటు నిబంధనల ప్రకారం జరగాలని ఉపాధిహామీ పథకం హిరమండలం క్లస్టర్ ఏపీడీ పి.రాధ తెలిపా రు.

ఎల్.ఎన్.పేట, ఫిబ్ర వరి 13(ఆంధ్రజ్యోతి): పనుల్లో సమయ పాలన పాటించడంతో పాటు నిబంధనల ప్రకారం జరగాలని ఉపాధిహామీ పథకం హిరమండలం క్లస్టర్ ఏపీడీ పి.రాధ తెలిపా రు. గురువారం మండ లంలోని తురకపేట గ్రామానికి సంబంధించిన తురకవానిచెరువులో జరుగుతున్న పనులతోపాటు ఇళ్లముందు జరుగుతున్న ఇంకుడు గుంతల పనులను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ పనుల్లో అక్రమాలు జరగకుండా సిబ్బంది పర్యవేక్షించాలని కోరారు. ఇంకుడు గుంతలను శతశాతం నిర్మాణాలు జరిగేలా చర్యలు తీసుకోవాలన్నారు. ఆమె వెంట ఏపీవో శ్రీదేవి, పంచాయతీకార్యదర్శి జి. తవిటినాయుడు, టీఏ ఆర్.మన్మఽథరావు, ఫీల్డ్ అసిస్టెంటు పద్మలు పాల్గొన్నారు.