కోల్డ్‌స్టోరేజీల నిర్మాణానికి ప్రతిపాదన: ఎండీ
ABN , Publish Date - Jan 17 , 2025 | 11:37 PM
రాష్ట్రంలో గోదాముల సామర్థ్యం పెంచడంతోపాటు కోల్డ్‌స్టోరేజీల నిర్మాణానికి ప్రతి పాదనలు పంపించినట్లు రాష్ట్ర గిడ్డంగులు, గోదాముల సంస్థ ఎండీ గేదెల సురేష్‌కుమార్ చెప్పారు. శుక్రవారం పొందూరులోని స్టేట్ వేర్‌హౌస్ గోదాములు పరిశీలించారు.

పొందూరు, జనవరి (ఆంధ్రజ్యోతి) 17: రాష్ట్రంలో గోదాముల సామర్థ్యం పెంచడంతోపాటు కోల్డ్‌స్టోరేజీల నిర్మాణానికి ప్రతి పాదనలు పంపించినట్లు రాష్ట్ర గిడ్డంగులు, గోదాముల సంస్థ ఎండీ గేదెల సురేష్‌కుమార్ చెప్పారు. శుక్రవారం పొందూరులోని స్టేట్ వేర్‌హౌస్ గోదాములు పరిశీలించారు. ఆయన వెంట శ్రీకాకుళం రీజినల్ మేనేజర్ రాజశ్రీ, పొందూరు మేనేజర్ సునీత ఉన్నారు.
ఫఆముదాలవలస, జనవరి 17(ఆంఽధ్రజ్యోతి): గిడ్డంగుల సంస్థ అభివృద్ధే ధ్యేయంగా ప్రతి ఉద్యోగి పనిచేయాలని ఆ సంస్థ ఎండీ సురేష్‌కుమార్ కోరారు. ఆముదాలవలసలో నిత్యావసర సరుకుల గోదాము, కార్యాలయంలోని రికార్డులను పరిశీలించారు.