inconvenience భక్తులకు ఇబ్బంది లేకుండా చర్యలు
ABN , Publish Date - Jan 12 , 2025 | 12:10 AM
ఆరోగ్య ప్రదాత అరస వల్లి సూర్యనారాయణ స్వామివారి రథసప్తమి సందర్భంగా భక్తులకు ఎటువంటి అసౌకర్యాలు కలుగకుండా అన్ని ఏర్పాట్లు చేస్తామని ఎమ్మెల్యే గొండు శంకర్ అన్నారు.

రథసప్తమి ఏర్పాట్లు పరిశీలించిన ఎమ్మెల్యే శంకర్
అరసవల్లి, జనవరి 11(ఆంధ్రజ్యోతి): ఆరోగ్య ప్రదాత అరస వల్లి సూర్యనారాయణ స్వామివారి రథసప్తమి సందర్భంగా భక్తులకు ఎటువంటి అసౌకర్యాలు కలుగకుండా అన్ని ఏర్పాట్లు చేస్తామని ఎమ్మెల్యే గొండు శంకర్ అన్నారు. ఈ మేరకు రథ సప్తమికి సంబంధించి తొలగిస్తున్న భవనాలను, జరుగుతున్న ఏర్పాట్లను ఆయన శనివారం పరిశీలించారు. ఈ సందర్భంగా శంకర్ మాట్లాడుతూ రథసప్తమిని రాష్ట్ర పండుగగా ప్రభుత్వం ప్రకటించడం జిల్లా వాసుల అదృష్టమన్నారు. నిర్మాణ పనుల ను త్వరితగతిన పూర్తి చేయాలని అధికారులకు సూచించారు. స్వామివారి దర్శనానికి వచ్చే భక్తుల వాహనాల పార్కింగ్ స్థ లం, క్యూలైన్లో వచ్చే సాధారణ భక్తులకు ఎటువంటి ఆటంకం లేకుండా ఏర్పాట్లు చేయాలన్నారు. ఆలయ పరిసరాలను పోలీసులతో కలిసి పరిశీలించారు. కార్యక్రమంలో ఎమ్మెల్యేతో పాటు ఆలయ ఈవో వై.భద్రాజీ, డీఎస్పీ వివేకానంద, సీఐ పైడపునాయుడు, ఎస్‌ఐలు పాల్గొన్నారు.
వేలంపాట ఖరారు
అరసవల్లి, జనవరి 11(ఆంధ్రజ్యోతి): ఆరోగ్య ప్రదాత, అరసవిల్లి సూర్యనారాయణ స్వామివారి రథసప్తమి వేడుకల పనులకు సంబంధించిన సీల్డ్ టెండర్ కమ్ బహిరంగ వేలం పాట నేడు ఖరారు అయింది. విద్యుద్దీపాలంకరణలో ఉంగటి పాపారావు రూ.22,90,000 ఖరారు కాగా, క్యూలైన్ల ఏర్పాటుకు పిల్లా మౌళికి రూ.3,19,000, రంగులు వేయడానికి డి.రాజారా వు రూ.1,80,000లకు ఖరారు చేశారు. అలాగే ఫొటోలు, వీడియో, ఎల్‌ఈడీ స్ర్కీన్ ఏర్పాటుకు, టీ, టిఫిన్, భోజనాలకు, సీసీ కెమెరాలకు సంబంధించి మళ్లీ వేలంపాట త్వరలో నిర్వ హించనున్నారు. కార్యక్రమంలో ఆలయ ఈవో వై.భద్రాజీ, ప్రధాన అర్చకులు ఇప్పిలి శంకరశర్మ, ఆలయ చైర్మన్ ఇప్పిలి జోగిసన్యాసిరావు, శ్రీకూర్మం ఆలయ ఈవో జి.గురునాథం తదితరులు పాల్గొన్నారు.