Share News

ఉపాధ్యాయుడిపై పోక్సో, అట్రాసిటీ కేసు నమోదు

ABN , Publish Date - Feb 24 , 2025 | 12:09 AM

దేవుపురం యూపీ పాఠశాల విద్యా ర్థినుల పట్ల అసభ్యకరంగా ప్రవర్తించిన ఉపాధ్యాయుడు కొండాల గోపాలం పై పోక్సో, ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేసినట్లు ఎస్‌ఐ షేక్‌మహ్మద్‌ ఆలీ తెలిపారు.

ఉపాధ్యాయుడిపై పోక్సో, అట్రాసిటీ కేసు నమోదు

నందిగాం, ఫిబ్రవరి 23(ఆంధ్రజ్యోతి): దేవుపురం యూపీ పాఠశాల విద్యా ర్థినుల పట్ల అసభ్యకరంగా ప్రవర్తించిన ఉపాధ్యాయుడు కొండాల గోపాలం పై పోక్సో, ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేసినట్లు ఎస్‌ఐ షేక్‌మహ్మద్‌ ఆలీ తెలిపారు. శనివారం డీఈవో ఎస్‌.తిరుమలచైతన్య, తహసీల్దార్‌ పి.సోమే శ్వరరావు తదితరుల నేతృత్వంలో ఈ ఘటనపై విచారణ చేపట్టడగా వాస్తవ మని తేలడంతో ఉపాధ్యాయుడిని సస్పెండ్‌ చేసిన సంగతి తెలిసిందే. దేవు పురం యూపీ పాఠశాలలో జరిగిన ఘటనకు బాధ్యుడైన ఉపాధ్యాయు డిపై అట్రాసిటీ కేసు నమోదైన నేపథ్యంలో టెక్కలి డీఎస్పీ డీఎస్‌ఆర్‌వీ ఎస్‌ఎన్‌ మూర్తి ఆదివారం సాయంత్రం విచారణ చేపట్టారు. టెక్కలి రూరల్‌ సీఐ కె.శ్రీనివాసరావు, నందిగాం ఎస్‌ఐ షేక్‌మహ్మద్‌ ఆలీ తదితరులతో కలిసి గ్రామాన్ని సందర్శించి బాధిత కుటుంబసభ్యులు గ్రామస్థులు, ఉపాధ్యాయు లను విచారించి వివరాలు సేకరించారు.
పురుగు మందు తాగి యువకుడి ఆత్మహత్యాయత్నం
కోటబొమ్మాళి, ఫిబ్రవరి 23(ఆంధ్రజ్యోతి):
హరిశ్చంద్రపురం పంచాయతీ బాపన్నపేట గ్రామానికి చెందిన దుంపల వాసుదేవరావు (24) ఆదివారం పురుగు మందుతాగి ఆత్మహత్యా యత్నానికి పాల్పడ్డాడు. ఎస్‌ఐ వి.సత్య నారాయణ తెలిపిన వివరాలిలా ఉన్నాయి.. వాసుదేవరావు గత ఏడాది డిసెంబరు 18న సీమెన్‌ ఉద్యోగం కోసం ముంబై వెళ్లాడు. అయితే అక్కడ నుంచి ముడురోజుల కిందట అనారోగ్యంతో బాధ పడుతూ కొన్ని మందులు తీసుకొని ఇంటికి చేరాడు. అయితే అందరితో కలిసి మెలిసి తిరుగుతూ ఆదివారం ఉదయం నరసన్నపేటలో ఒకరిని పరామర్శించి మధ్యాహ్నానికి ఇంటికి చేరాడు. పొలానికి వినియోగించగా మిగిలిన పురుగు మందును తండ్రి అప్పన్న ఇంట్లో దాచాడు. ఏం జరిగిందో తెలియదు కాని ఆ మందు లో సగం వాసుదేవరావు సేవించాడు. దీనిని తల్లి లక్ష్మి గమనించి పరుగున వెళ్లి మందు డబ్బాను చేతిలోంచి లాక్కుని వెంటనే ఇరుగు పొరుగు వారికి విషయం తెలిపింఇ. వెంటనే వారు వచ్చి వాసుదేవరావును కోటబొమ్మాళి సామాజిక ఆసుపత్రికి తరలించారు. ఇక్కడ వైద్యుల సూచనల మేరకు మెరుగైన వైద్యం కోసం శ్రీకాకుళం రిమ్స్‌కు తరలించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ తెలిపారు. అయితే ఆత్మహత్యాయత్నానికి కారణాలు తెలియరాలేదు.
అప్పులబాధతో వ్యక్తి ఆత్మహత్య
గార, ఫిబ్రవరి 23(ఆంధ్రజ్యోతి):
అప్పులబాధతో వ్యక్తి ఆత్మహత్య చేసుకున్న ఘటన మండలంలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. కొర్ని గ్రామానికి చెందిన వజ్జ రమణమూర్తి (37)కి 2016లో వివా హం జరిగింది. ఇద్దరు పిల్లలున్నారు. వ్యవసాయం చేసుకుంటూ కుటుం బాన్ని పోషించుకుంటున్నాడు. అప్పులతో ఆర్థిక ఇబ్బందుల ఎదుర్కొంటు న్నాడు. దీంతో కొన్నాళ్లుగా మానసికంగా బాధపడుతూ ఆదివారం గ్రామ సమీపంలో ఉన్న చెట్టుకు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. రమణ మూర్తి భార్య భాగ్యలక్ష్మి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ ఆర్‌.జనార్దన్‌ తెలిపారు.

Updated Date - Feb 24 , 2025 | 12:09 AM