Share News

Train రైలు నుంచి జారిపడి వ్యక్తికి గాయాలు

ABN , Publish Date - Jan 04 , 2025 | 11:59 PM

Train హరిశ్చంద్రపురం రైల్వే ఫ్లై ఓవర్‌ సమీపంలో శనివారం జరిగిన రైలు ప్రమాదంలో పాతపట్నం మండలం సీది పంచాయతీ తీమర గ్రామానికి చెందిన ఎందవ రామా రావు తీవ్రంగా గాయపడ్డాడు.

Train  రైలు నుంచి జారిపడి వ్యక్తికి గాయాలు

కోటబొమ్మాళి, జనవరి 4 (ఆంధ్ర జ్యోతి): హరిశ్చంద్రపురం రైల్వే ఫ్లై ఓవర్‌ సమీపంలో శనివారం జరిగిన రైలు ప్రమాదంలో పాతపట్నం మండలం సీది పంచాయతీ తీమర గ్రామానికి చెందిన ఎందవ రామా రావు తీవ్రంగా గాయపడ్డాడు. వివరా లిలా ఉన్నాయి.. హైదరాబాద్‌లో ఓ ప్రైవేట్‌ కంపెనీలో ఏజెంట్‌గా పనిచేస్తు న్న రామారావు ఆదివారం వారి స్వగ్రామంలో జరిగే ఒక కార్యక్రమానికి హాజ రయ్యేందుకు విశాఖ ఎక్స్‌ప్రెస్‌లో వచ్చాడు. ఇతడు తిలారులో దిగాల్సి ఉండ గా అదమరిచి స్టేషన్‌లో దిగలేదు.. ఎక్కడ దిగాలో ఆలోచిస్తున్న తరుణంలో హరిశ్చంద్రపురం రైలు నిలయం వద్ద రైల్వే పనులు సిబ్బంది చేస్తుండగా రైలు నెమ్మదిగా వెళుతున్నట్లు గుర్తించి రామారావు రైలు దిగే క్రమంలో కిందపడి పోవడంతో తీవ్ర గాయాలయ్యాయి అక్కడ పనులు చేస్తున్న సిబ్బం ది 108కు సమాచారం ఇవ్వడంతో స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకు వెళ్లి ప్రథమ చికిత్స అనంతరం మెరుగైన వైద్యం కోసం శ్రీకాకుళం రిమ్స్‌కు తరలించారు.

బొర్రంపేటలో ఇరువర్గాల మధ్య వివాదం

ఎల్‌.ఎన్‌.పేట, జనవరి 4(ఆంధ్రజ్యోతి): బొర్రంపేట గ్రామంలో శుక్రవారం ఇరువర్గాల నడుమ జరిగిన వివాదంలో ముగ్గురిపై కేసు నమోదు చేసినట్లు ఎస్‌ఐ బి.హైమవతి తెలిపారు. పోలీసులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి.. శుక్రవారం వీధి కాలువలో మురుగునీరు, చెత్త కుప్పలను తొలగిస్తుండగా మురుగునీరు తమ స్థలంలోకి వెళుతోందని కింతలి అఖిల్‌, రామారావు, భాను మతిలు కోట గున్నమ్మ, అప్పన్న, బొడ్డేపల్లి రాములతో ఘర్షణకు దిగి చేయి చేసుకున్నారు. వీధి కాల్వల్లో పనులను పూర్తి చేసేందుకు సర్పంచ్‌ బి.రమ ణమ్మ కోట గున్నమ్మ, అప్పన్న, రామారావులకు బాధ్యత అప్పగించగా వారు పనులు చేయిస్తున్న సమయంలో ఈ ఘటన చోటు చేసుకుంది. దీంతో దీంతో గున్నమ్మ, అప్పన్న, రాము ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఘర్షణకు దిగిన ముగ్గురిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ తెలిపారు.

Updated Date - Jan 04 , 2025 | 11:59 PM