Pending cases పెండింగ్ కేసులు తగ్గించాలి
ABN , Publish Date - Feb 15 , 2025 | 12:32 AM
పెండిగ్‌లో ఉన్న కేసులు తగ్గించేందుకు కృషి చేయాలని జిల్లా న్యాయాధికారి జునైద్ అహ్మద్ మౌలానా అన్నారు.

జిల్లా న్యాయాధికారి జునైద్ అహ్మద్ మౌలానా
8న జాతీయ లోక్ అదాలత్
గుజరాతీపేట, ఫిబ్రవరి 14 (ఆంధ్రజ్యోతి): పెండిగ్‌లో ఉన్న కేసులు తగ్గించేందుకు కృషి చేయాలని జిల్లా న్యాయాధికారి జునైద్ అహ్మద్ మౌలానా అన్నారు. స్థాని క జిల్లా కోర్టు భవనం లో శుక్రవారం పోలీసు అధికారులు, ఇన్సూరెన్స్ కంపెనీలు, న్యాయవాదులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన న్యాయమూర్తి మాట్లాడు తూ.. వచ్చే నెల 8న నిర్వహించనున్న జాతీయ లోక్ అదాలత్‌లో ఎక్కువ కేసులు రాజీ చేయించాలని సూచించారు. ఇరు వర్గాలకు రాజీ వల్ల కలిగే ప్రయోజనాలపై అవగాహన కల్పించి వారి మధ్య మంచి సంబంధం నెలకొల్పేలా చూడాలన్నారు. మెటారు వాహనాల ప్రమాద కేసు ల్లో ఇన్సూరెన్స్ కంపెనీలు త్వరి తగతిన బాధితులకు, వారి కుటుం బాలకు న్యాయం చేయాలని కోరారు. కార్యక్రమంలో జిల్లా న్యాయాధికా రులు సీహెచ్ వివేక్ ఆనంద్ శ్రీని వాస్, ఎస్‌ఎల్ ఫణికుమార్, కేవీఎల్ హిమబిందు, జిల్లా న్యాయసేవాధి కార సంస్థ కార్యదర్శి ఆర్.సన్యాసి నాయుడు, ఏఎస్పీ పి.శ్రీనివాసరావు, పబ్లిక్ ప్రాసిక్యూటర్లు, న్యాయవాది మంచు జనార్దనరావు, ఇన్సూరెన్స్ కంపెనీల ప్రతినిధులు, పలువురు న్యాయవాదులు, పోలీసు అధికారులు తదితరులు పాల్గొన్నారు.