Share News

Nirasana పీఏసీఎస్‌ సిబ్బంది పెన్‌డౌన్‌

ABN , Publish Date - Jan 09 , 2025 | 12:01 AM

Nirasana హెచ్‌ఆర్‌ పాల సీని అమలు చేయాల్సి ఉన్నా ఇప్పటి వరకు అమలుచేయక పోవడం, పీఆర్సీ బకాయిలు చెల్లించకపోవడంతో పీఏసీఎస్‌ సిబ్బంది బుధవారం పెన్‌డౌన్‌ చేసి నిరసన తెలిపారు.

Nirasana పీఏసీఎస్‌ సిబ్బంది పెన్‌డౌన్‌
నల్లబ్యాడ్జీలు ధరించి నిరసన తెలుపుతున్న సిబ్బంది

కోటబొమ్మాళి, జనవరి 8 (ఆంధ్రజ్యోతి): హెచ్‌ఆర్‌ పాల సీని అమలు చేయాల్సి ఉన్నా ఇప్పటి వరకు అమలుచేయక పోవడం, పీఆర్సీ బకాయిలు చెల్లించకపోవడంతో పీఏసీఎస్‌ సిబ్బంది బుధవారం పెన్‌డౌన్‌ చేసి నిరసన తెలిపారు. ప్రభుత్వం 62 సంవత్సరాలకు పదవీ విర మణ వయసు పెంచినా పీఏ సీఎస్‌లకు అమలు చేయలేదని, ఉద్యోగ విరమణ చేసిన వారికి రూ.2 లక్షలు తప్ప ఇతర ప్రతిఫలాలు ఇవ్వడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా ఉన్నతాధికారులు చర్యలు తీసుకుని న్యాయం చేయాలని కోరారు. కార్యక్రమంలో సీఈవో మెండ సత్యం, సిబ్బంది పాల్గొన్నారు.

Updated Date - Jan 09 , 2025 | 12:01 AM