వీఐపీలకన్నా సామాన్య భక్తులకే ప్రాధాన్యం: మంత్రి
ABN , Publish Date - Feb 03 , 2025 | 12:14 AM
అరసవల్లి రథసప్తమి వేడు కల్లో వీఐపీల కన్నా సామాన్య భక్తులకే ప్రాధాన్యమివ్వాలని అధికారు లను ఆదేశించినట్టు వ్యవ సాయశాఖ మంత్రి అచ్చెన్నాయుడు తెలిపారు.

శ్రీకాకుళం, ఫిబ్రవరి 2(ఆంధ్రజ్యోతి): అరసవల్లి రథసప్తమి వేడు కల్లో వీఐపీల కన్నా సామాన్య భక్తులకే ప్రాధాన్యమివ్వాలని అధికారు లను ఆదేశించినట్టు వ్యవ సాయశాఖ మంత్రి అచ్చెన్నాయుడు తెలి పారు. భక్తులంతా స్వామిని ప్రశాంతంగా దర్శించుకోవాలని కోరారు. ఆదివారం రాత్రి విలేకరులతో ఆయన మాట్లాడుతూ.. గత తప్పి దాలు పునరావృతం కాకుండా.. రాష్ట్రస్థాయి పండగగా రథసప్తమి వేడుకలు నిర్వహిస్తున్నామన్నారు. సామూహిక సూర్య నమస్కా రాలు, శోభాయాత్ర ఘనంగా నిర్వహించామని తెలిపారు. తొలి సారిగా హెలీ టూరిజం తీసుకు వచ్చామని, వచ్చే ఏడాది రెండు, మూడు హెలికాప్టర్‌లు ఏర్పాటు చేస్తామన్నారు.
నిన్నటి నుంచి పిచ్చోడిలా మాట్లాడుతున్నాడు..
నిన్నటి నుంచి పిచ్చోడిలా మాట్లాడుతున్నాడని వైసీపీ అధ్యక్షుడు జగన్మో హన రెడ్డిని ఉద్దేశించి మంత్రి అచ్చెన్నాయుడు విమర్శించారు. కేంద్రబడ్జెట్‌లో ఆంధ్రప్రదేశ్ పేరు చదవలేదని.. బీహార్ పేరు చది వారని ఆరోపణలు చేస్తున్నారన్నారు. బుద్ధీ జ్ఞానం ఉందా అని ప్రశ్నించారు. ప్రభుత్వం ఏర్పడిన ఆరు నెలల్లోనే దేశంలో అత్యధిక నిధులను రాష్ట్రానికి సీఎం చంద్రబాబు తీసుకువచ్చారని వివరిం చారు. చంద్రబాబుకి బడ్జెట్‌తో పనిలేదని.. ఢిల్లీ వెళ్లగానే గ్రీన్‌ఛానల్ ఉందన్న విషయాన్ని ప్రజలు గుర్తించాలని స్పష్టం చేశారు. పోల వరం ప్రాజెక్టుకు రూ.12,500 కోట్లు, అమరావతి రాజధానికి రూ.15 వేల కోట్లు.. ఇలా చాలావాటికి నిధులు భారీగా ఇస్తున్నా.. వైసీపీ చెత్త విమర్శలు చేస్తోందని మండిపడ్డారు.