ప్రతి తరగతికి ఒక ఉపాధ్యాయుడు
ABN , Publish Date - Feb 17 , 2025 | 11:48 PM
వైసీపీ ప్రభుత్వంలో నిర్లక్ష్యానికి గురైన విద్యారంగాన్ని బలో పేతం చేసేందుకు కూటమి ప్రభుత్వం ప్రభుత్వం పాఠశాలల్లో ఉపాధ్యాయుల సంఖ్యను పెంచు తోందని పీయూసీచైర్మన్, ఎమ్మెల్యే కూన రవికుమా ర్ చెప్పారు.

పొందూరు,ఫిబ్రవరి 17(ఆంధ్రజ్యోతి): వైసీపీ ప్రభుత్వంలో నిర్లక్ష్యానికి గురైన విద్యారంగాన్ని బలో పేతం చేసేందుకు కూటమి ప్రభుత్వం ప్రభుత్వం పాఠశాలల్లో ఉపాధ్యాయుల సంఖ్యను పెంచు తోందని పీయూసీచైర్మన్, ఎమ్మెల్యే కూన రవికుమా ర్ చెప్పారు. సోమవారం పొందూరులో ఎంపీపీ కిల్లి ఉషారాణి అధ్యక్షతన జరిగినమండలపరిషత్ సమా వేశంలో మాట్లాడుతూ రాష్ట్రంలో కొన్ని పాఠశాలల ను ఆదర్శ ప్రాధమిక పాఠశాలలుగా మారుస్తున్నట్లు తెలిపారు. ఈ పాఠశాలల్లో ప్రతి తరగతికి ఒక ఉపాధ్యాయుడు ఉంటారన్నారు దీంతో మండలంలో 154 మంది ఉన్న ఉపాద్యాయుల సంఖ్య 250కి పైగా పెరు గుతుందన్నారు.కార్యక్రమంలో ఎంపీటీసీలు కూన ప్రమీల, ఎ.కుమారి, ఎ.వాణి, ఎం.సీతారామరాజు, వి.పార్వతి, సర్పంచ్‌లు ఆర్.లక్ష్మి, పప్పలవేణు, బి. పోలినా యుడు ఎంపీడీవో మన్మఽథరావు పాల్గొన్నారు.