Old pension పాతపెన్షన్ విధానం అమలు చేయాలి
ABN , Publish Date - Feb 17 , 2025 | 12:02 AM
పాతపెన్షన్ విధానం అమలు చేయాలని డీఎస్సీ-2003 ఫారం రాష్ట్ర కన్వీనర్ మోపిదేవి శివశంకర్ అన్నా రు.

గుజరాతీపేట, ఫిబ్రవరి 16(ఆంధ్రజ్యోతి): పాతపెన్షన్ విధానం అమలు చేయాలని డీఎస్సీ-2003 ఫారం రాష్ట్ర కన్వీనర్ మోపిదేవి శివశంకర్ అన్నా రు. స్థానిక శాంతినగర్ కాలనీలోని కళింగ భవన్‌లో డీఎస్సీ-2003 ఉత్తరాం ధ్ర ఫారం ఆధ్వర్యంలో మెమో 57 ఉద్యోగ, ఉపాధ్యాయ సాధన సమితి సమావేశం ఆదివారం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. 2003లో నోటిఫికేషన్ విడుదలైనప్పటికీ 2005న నియామకాలు చేపట్టి ఆలస్యం చేసినందుకు పీపీఎస్ విధానంపై నెట్టారని ఆరోపించారు. ఎన్జీవో జిల్లా అధ్యక్షుడు హనుమంతు సాయిరాం మాట్లాడుతూ.. మెమో 57 ప్రాప్తికి పాతపెన్షన్ విధానం వర్తింపజేసి, అన్ని రకాలు సహకారం అం దిస్తామని హామీ ఇచ్చారన్నారు. ఏపీ ఉపాధ్యాయ సంఘం జిల్లా అధ్యక్షు డు దుప్పల శివరాం ప్రసాద్ మాట్లాడుతూ.. మెమో 57 ప్రాప్తికి 15 రాష్ట్రా లు పాత పెన్షన్ విధానం అమలు చేశాయని, ఈ రాష్ట్రంలో అమలు చే యాలని కోరారు. డీఎస్సీ-2003 ఫారం జిల్లా కన్వీనర్ పి.శ్రీహరి మాట్లా డుతూ.. దేశంలో సీపీఎస్ ఉద్యోగులకు ఫ్యామిలీ పెన్షన్, గ్రాట్యూటీ అమ లు చేశారని, నేడు మెమో 57 ప్రాప్తికూడా అమలు చేయాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో రాష్ట్ర, జిల్లా నాయకులు కె.శ్రీహరి, సుబ్బారెడ్డి, షేక్ మహ్మద్, గాదె శ్రీనివాసులు నాయుడు, కోరెడ్ల విజయగౌరి, కె.భానుమూర్తి, హృదయరాజు, ఎస్.అనిల్‌కుమార్, ఎస్.కిశోర్, జి.గిరిధర్, సీహెచ్ రవీంద్ర, పి.రాజశేఖర్, డి.కేశవ్, బి.నేతాజీ తదితరులు పాల్గొన్నారు.