Share News

Ganjayi ఒడిశా టు మహారాష్ట్ర

ABN , Publish Date - Feb 24 , 2025 | 11:46 PM

Ganjayi ఒడిశా నుంచి మహారాష్ట్రకు 21 కేజీల గంజాయి తరలిస్తుండగా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

Ganjayi ఒడిశా టు మహారాష్ట్ర
మాట్లాడుతున్న డీఎస్పీ వెంకట అప్పారావు

21 కేజీల గంజాయిని స్వాధీనం చేసుకున్న పోలీసులు

నలుగురి అరెస్ట్‌, ద్విచక్ర వాహనం సీజ్‌

ఇచ్ఛాపురం, ఫిబ్రవరి 24(ఆంధ్రజ్యోతి): ఒడిశా నుంచి మహారాష్ట్రకు 21 కేజీల గంజాయి తరలిస్తుండగా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. సోమ వారం ఇచ్ఛాపురం సర్కిల్‌ కార్యాలయంలో పట్టుబడిన గంజాయి కేసు వివ రాలను కాశీబుగ్గ డీఎస్పీ వెంకట అప్పారావు సీఐ మీసాల చిన్నమనాయు డుతో కలిసి విలేకరులకు వివరించారు. డీఎస్పీ కథనం మేరకు.. ఒడిశాలోని గజపతి జిల్లా ఆర్‌.ఉదయగిరి ప్రాంతానికి చెందిన ఆంటుని బిర తన సహా యకుడు తపన్‌ బిరతో కలిసి 21 కేజీల 610 గ్రాముల గంజాయిని ఒడిశా నుంచి తరలిస్తున్నాడు. పిల్పా బర్దన్‌, ఆకాష్‌ బిరల ద్వారా రైలు మార్గంలో మహారాష్ట్రకు పంపించేందుకు ఏర్పాట్లు చేశాడు. జాతీయ రహ దారిపై కవిటి మండలంలోని ఆర్‌.బెలగాం ప్లైఓవర్‌ వద్ద పోలీసుల తనిఖీల్లో ఒడిశాలోని గజపతి జిల్లా ఆర్‌.ఉదయగిరికి చెందిన అంటుని బీర, తపన్‌బిర, ఆకాష్‌ బిర, గజపతి జిల్లా అడవ పోలీసుఠాణా పరిధిలోగల మండిమీరకు చెందిన పిల్పా బర్దన్‌ పట్టుబడ్డారు. గంజాయిని మహారాష్ట్రలోని వ్యాపారి అశోక్‌ హెవాల్‌ అలియాస్‌ రాజుకు అప్పగించేందుకు నలుగురు తరలిస్తున్నారు. ఈ మేరకు వీరి అరెస్ట్‌ చేశారు. వారి నుంచి గంజాయితో పాటు నాలుగు సెల్‌ఫోన్లు, ద్విచక్ర వాహనం స్వాధీనం చేసుకున్నారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Updated Date - Feb 24 , 2025 | 11:46 PM