Share News

పట్టుమహాదేవి కోనేరు పరిశీలన

ABN , Publish Date - Feb 13 , 2025 | 11:35 PM

: టెక్కలిలోని పట్టుమహాదేవి కోనేరును విశాఖ జీవీఎంసీ సలహా ప్రతినిధుల బృందం గురువారం పరిశీలించింది. ఎయిర్‌పోర్టు అథారిటీ ఐదుకోట్ల రూపాయల సీఎస్‌ఆర్‌ నిధులు వినియోగానికి కేంద్ర,రాష్ట్ర మంత్రులు కింజరాపు రామ్మోహన్‌నాయుడు, అచ్చెన్నాయుడులు కృషి మేరకు నిధులు మంజూరైన విషయం విదితమే.

 పట్టుమహాదేవి కోనేరు పరిశీలన
కోనేరుగట్టు వివరాలు సేకరిస్తున్న జీవీఎంసీ సలహా సంఘం ప్రతినిధులు:

టెక్కలి, ఫిబ్రవరి 13(ఆంధ్రజ్యోతి): టెక్కలిలోని పట్టుమహాదేవి కోనేరును విశాఖ జీవీఎంసీ సలహా ప్రతినిధుల బృందం గురువారం పరిశీలించింది. ఎయిర్‌పోర్టు అథారిటీ ఐదుకోట్ల రూపాయల సీఎస్‌ఆర్‌ నిధులు వినియోగానికి కేంద్ర,రాష్ట్ర మంత్రులు కింజరాపు రామ్మోహన్‌నాయుడు, అచ్చెన్నాయుడులు కృషి మేరకు నిధులు మంజూరైన విషయం విదితమే. ఈమేరకు పట్టుమహాదేవి కోనేరుకు సంబంధించి కొంతమేర సీఎస్‌ఆర్‌ నిధులు వెచ్చించిందుకు గాను పూడి కలు, గట్టుపై ఉన్న పరిస్థితులు ఆ బృందం వివరాలు సేకరించింది. వీరి వెంట టీడీపీ మండలాధ్యక్షులు బగాది శేషగిరి, లవకుమార్‌, ప్రసాద్‌రెడ్డి, ప్రపుల్లా, సాహుకారి మోహనరావు తదితరులు ఉన్నారు.

Updated Date - Feb 13 , 2025 | 11:35 PM