Share News

Nandamuri Ramakrishna ఆదిత్యుని సన్నిధిలో నందమూరి రామకృష్ణ

ABN , Publish Date - Feb 14 , 2025 | 12:10 AM

ఆరోగ్యప్రదాత అరసవల్లి సూర్యనారా యణ స్వామివారిని తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు, దివంగత మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు కుమారుడు నందమూరి రామకృష్ణ గురువారం ఉదయం 4.30 గంటలకు దర్శించుకున్నారు.

Nandamuri Ramakrishna  ఆదిత్యుని సన్నిధిలో నందమూరి రామకృష్ణ
రామకృష్ణకు స్వామివారి జ్ఞాపికను అందిస్తున్న దృశ్యం

అరసవల్లి, ఫిబ్రవరి 13(ఆంధ్రజ్యోతి): ఆరోగ్యప్రదాత అరసవల్లి సూర్యనారా యణ స్వామివారిని తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు, దివంగత మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు కుమారుడు నందమూరి రామకృష్ణ గురువారం ఉదయం 4.30 గంటలకు దర్శించుకున్నారు. వారికి శ్రీకాకుళం ఎమ్మెల్యే గొండు శంకర్‌ వేదమంత్రాలు, మంగళ వాయిద్యాల నడుమ స్వాగతం పలికి ప్రత్యేక పూజలు చేయించారు. వారికి స్వామివారి జ్ఞాపికను ఆలయ ఈవో వై.భద్రాజీ అందజేశారు. స్థానిక కార్యకర్తలు, భక్తులు పాల్గొన్నారు.

Updated Date - Feb 14 , 2025 | 12:10 AM