Share News

mosquitoes దోమల నివారణకు చర్యలు

ABN , Publish Date - Feb 13 , 2025 | 12:18 AM

నగరపాలక సంస్థ పరిధిలోని 29, 30వ డివిజన్‌ హౌసింగ్‌ బోర్డు కాలనీలో దోమల నివారణకు అధికారులు చర్యలు ప్రారంభించారు.

mosquitoes దోమల నివారణకు చర్యలు
హౌసింగ్‌ బోర్డు కాలనీలో దోమల నివారణ మందు స్ర్పే చేస్తున్న దృశ్యం

  • ‘అక్షరం అండగా.. పరిష్కారమే అజెండాగా’ కార్యక్రమానికి స్పందించిన అధికారులు

శ్రీకాకుళం అర్బన్‌, ఫిబ్రవరి 12(ఆంధ్రజ్యోతి): నగరపాలక సంస్థ పరిధిలోని 29, 30వ డివిజన్‌ హౌసింగ్‌ బోర్డు కాలనీలో దోమల నివారణకు అధికారులు చర్యలు ప్రారంభించారు. ఇటీవల ‘ఆంధ్రజ్యోతి-ఏబీఎన్‌’ ఆధ్వర్యంలో నిర్వహించిన ‘అక్షరం అండగా.. పరిష్కారం అజెండాగా’ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న కేంద్రమంత్రి కింజరాపు రామ్మోహన్‌ నాయుడుకి హౌసింగ్‌ బోర్డు కా లనీ ప్రజలు తమ ప్రాంతంలో దోమల సమస్య అధికం గా ఉందని పరిష్కారం చూపాలని కోరారు. ఇందులో భాగంగా నగరపాలక హెల్త్‌అధికారి సుధీర్‌కుమార్‌ ఆధ్వర్యంలో బుధవారం యాంటీ లార్వా (ఏఎల్‌ వో) మందును స్ర్పే చేయించారు. బెహరా మ నోవికాస కేంద్రం, న్యూ టీపీఎం స్కూల్‌, కర్ణపువీధి, రాధాకృష్ణనగర్‌, ఉడా పార్క్‌ ఏరియా, మావూరి వీధి, కలెక్టర్‌ బంగ్లా సమీప కాలువల్లో దోమల నివారణ మందు స్ర్పే చేయించారు. ఈ సందర్భంగా హెల్త్‌ అధికారి సుధీర్‌ మాట్లాడుతూ.. కేంద్ర మంత్రి సూచనల మేరకు ప్రజల నుంచి వచ్చిన సమస్యలు పరిష్కరించేందుకు తొలి ప్రాధాన్యం ఇస్తూ క్రమ పద్ధతిలో సమస్యలు పరిష్కరిస్తున్నామని స్పష్టం చేశారు. కార్యక్రమంలో శానిటేషన్‌ సెక్రటరీలు అనిల్‌, శ్రీనివాస్‌, పారిశుధ్య కార్మికులు తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Feb 13 , 2025 | 12:18 AM