మురుగునీటి శుద్ధికి చర్యలు
ABN , Publish Date - Jan 25 , 2025 | 12:08 AM
మేజర్ పంచాయతీ నరసన్నపేటలో గత టీడీపీ ప్రభుత్వ హయాంలో నిర్మాణం చేపట్టిన అండర్ డ్రైనేజ్ వ్యవస్థను పూర్తిస్థాయిలో అమలు చేసి మురుగు నీటిని శుద్ధి చేసే దిశలో కూటమి ప్రభుత్వం చర్యలు తీసు కుంటోందని ఆర్‌డబ్యూఎస్ ఎస్‌ఈ ఇషాన్ బాషా అన్నారు.

నరసన్నపేట, జనవరి 24 (ఆంధ్రజ్యోతి): మేజర్ పంచాయతీ నరసన్నపేటలో గత టీడీపీ ప్రభుత్వ హయాంలో నిర్మాణం చేపట్టిన అండర్ డ్రైనేజ్ వ్యవస్థను పూర్తిస్థాయిలో అమలు చేసి మురుగు నీటిని శుద్ధి చేసే దిశలో కూటమి ప్రభుత్వం చర్యలు తీసు కుంటోందని ఆర్‌డబ్యూఎస్ ఎస్‌ఈ ఇషాన్ బాషా అన్నారు. శుక్రవారం పట్టణంలో అండర్ డ్రైనేజ్ అవుట్ లెట్‌లను పరిశీలించారు. ఏడేళ్ల కిందట నిర్మిం చిన అండర్ గ్రౌండ్ డ్రైనేజ్‌ను ఇటీవల కలెక్టర్ స్వప్నిల్ పుండ్కర్ దినకర్ పరిశీలించడంతో పనుల్లో మరలా కదిలిక వచ్చింది. మురుగు నీటిని శుద్ధి చేసి పొలాలకు అందించేందుకు సాధ్యా సాధ్యాలను పరిశీలించి నివేదికను కలెక్టర్‌కు అందజేయనున్నట్లు ఎస్‌ఈ తెలిపారు. కార్యక్రమంలో ఈఈ రంగనాథం, డీఈఈ సుదర్శనరావు, ఏఈలు కనకేశ్వరరావు, బసవేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.