Ganjjai భారీగా గంజాయి పట్టివేత
ABN , Publish Date - Feb 15 , 2025 | 12:30 AM
వేర్వే రు ఘటనల్లో భారీగా గంజా యిని పోలీసులు పట్టుకున్నారు. ఈ ఘటనల్లో ఐదురుగురిని అరెస్టు చేశారు.

ఇచ్ఛాపురంలో 18.3 కిలోలు.. కంచిలిలో 2.08 కిలోలు
ఈ రెండు ఘటనల్లో ఐదుగురి అరెస్టు
వివరాలు వెల్లడించిన కాశీబుగ్గ డీఎస్పీ వెంకటప్పారావు
ఇచ్ఛాపురం, ఫిబ్రవరి 14(ఆంధ్రజ్యోతి): వేర్వే రు ఘటనల్లో భారీగా గంజా యిని పోలీసులు పట్టుకున్నారు. ఈ ఘటనల్లో ఐదురుగురిని అరెస్టు చేశారు.
ఒడిశాలో కొ నుగోలు చేసిన గంజాయిని ఇచ్ఛాపురం రైల్వే స్టేషన్ మీదుగా బెంగళూరు కు తరలించేందుకు సిద్ధమవుతున్న ఇద్దరు వ్యక్తులను పట్టణ పో లీసులు పట్టుకున్నారు. ఇందుకు సంబంధిం చిన వివరాలను శు క్రవారం స్థానిక స ర్కిల్ కార్యాలయంలో కాశీబుగ్గ డీఎస్పీ వెం కటప్పారావు వెల్లడిం చారు. కర్ణాటక రాష్ట్రం బెంగళూరుకు చెందిన ముజామిల్, మహ్మద్ సిరా జుద్దీన్ గంజాయికి బానిస వడంతోపాటు గంజాయి వ్యాపారం చేస్తున్నారు. ఈ క్రమంలో ఒడి శా రాష్ట్రం ఖందమాల్ జిల్లా, పుల్బాని ప్రాంతంలో ఉంటున్న భరత్ డిఘాల్ వద్ద సుమారు 18.3 కిలోల గంజాయిని కొనుగోలు చేశారు. దీనిని బెంగళూరుకు తరలించేం దుకు బస్సులో బరంపురం మీదుగా ఇచ్ఛాపురం బస్టాండ్‌కు, అక్కడి నుంచి బెంగళూరు వెళ్లేందుకు రైల్వేస్టేషన్‌కు చేరుకున్నారు. అనుమానితులుగా కనిపించడంతో పోలీసులు వాళ్లను తనిఖీ చేయగా.. గంజాయి ఉన్నట్టు గుర్తించారు. ఈ గంజాయిని బెంగళూరుకు చెందిన విజయ్‌కుమార్‌కు అమ్మేందుకు తీసుకెళ్తున్నట్టు విచారణలో చెప్పారు. పట్టుబడిన వీరిని అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించామని డీఎస్పీ తెలిపారు. సీఐ మీసాల చిన్నమనాయుడు, పట్టణ ఎస్‌ఐ ముకుందరావు ఉన్నారు.
రైలు నిలయం వద్ద రెండు కిలోలు..
కంచిలి, ఫిబ్రవరి 14(ఆంధ్రజ్యోతి): మండల కేంద్రంలోని రైలు నిలయం సమీపంలో శుక్రవారం సాయంత్రం ముగ్గురు వ్యక్తులు గంజాయి విక్రయిస్తుండగా అదుపులోనికి తీసుకుని, వారి నుంచి రెండు కిలోల గంజాయి స్వాధీనం చేసుకున్నట్టు కాశీబుగ్గ డీఎస్పీ వి.వెంకటప్పారావు తెలిపారు. ఈ మేరకు కంచిలి పోలీస్ స్టేషన్‌లో సోంపేట సీఐ బి.మంగరాజు, కంచిలి ఎస్‌ఐ పి.పారినాయిడుతో కలిసి శుక్రవారం రాత్రి విలేకరులతో మాట్లాడారు. తమిళనాడుకు చెందిన అజిత్ అనే లారీ క్లీనర్ తరచూ లోడిండ్‌తో చెన్నై నుంచి కోలకత్తా వెళ్తుండేవాడు. ఈ క్రమంలో ఒడిశా రాష్ట్రం సుర్ల జంక్షన్ వద్ద సోమేష్ అనే వ్యక్తితో పరిచయం ఏర్పడింది. సోమేష్ డ్రైవర్‌కు క్లీనర్లకు గంజాయి అమ్ముతుండేవాడు. అజిత్ గంజాయి పొట్లాలను సోమేష్ నుంచి తీసుకువెళ్లి చెన్నైలో విక్రయించేవాడు. ఈ క్రమంలో తన స్నేహితుడు కమలుద్దీన్‌కు ఈ గంజాయి వ్యాపారం గురించి వివరించాడు. దీంతో వాళ్లిద్దరూ పెద్ద మొత్తంలో గంజాయిని విక్రయించేందుకు సోమేష్‌తో మాట్లాడారు. ఈ క్రమంలో సోమేష్ నుంచి రెండు కిలోల గంజాయిని కొనుగోలు చేసేందుకు తన స్నేహితుడు కమలుద్దీన్‌తో కలిసి అజిత్ ఈనెల 11న చెన్నైలో బయలుదేరారు. 13వ తేదీ ఉదయం సోమేష్‌కి రూ.20వేలు అందించి రెండు కిలోల గంజాయి కావాలని చెప్పగా.. అతడు శుక్రవారం సాయంత్రం కంచిలి రైల్వే నిలయం సమీపంలో ఉంటే సరుకు అక్కడికి తెచ్చి ఇస్తానని వారితో చెప్పాడు. దీంతో శుక్రవారం సాయంత్రం కంచిలి రైలు నిలయం వద్దకు ముగ్గురు వచ్చారు. ఎస్‌ఐ పారినాయిడు సిబ్బందితో కలిసి తనిఖీలు చేస్తుండగా పట్టుబడ్డారు. వారి నుంచి 2.08 కిలోల గంజాయితోపాటు రెండు సెల్‌ఫోన్లు స్వాధీనం చేసుకున్నట్టు డీఎస్పీ తెలిపారు.