Share News

Manavseva మానవసేవే.. మాధవసేవ

ABN , Publish Date - Mar 03 , 2025 | 11:54 PM

Manavseva మానవసేవే మాధవసేవ అని, ప్రతి ఒక్కరు దీనిని ఆచరించాలని త్రిదండి శ్రీమన్నారాయణ రామానుజ చిన్న జీయర్‌ స్వామి అన్నా రు.

Manavseva   మానవసేవే.. మాధవసేవ
టెక్కలిలో అనుగ్రహభాషణం చేస్తున్న జీయర్‌ స్వామి

త్రిదండి శ్రీమన్నారాయణ రామానుజ చిన్న జీయర్‌ స్వామి

టెక్కలి, మార్చి 3(ఆంధ్రజ్యోతి): మానవసేవే మాధవసేవ అని, ప్రతి ఒక్కరు దీనిని ఆచరించాలని త్రిదండి శ్రీమన్నారాయణ రామానుజ చిన్న జీయర్‌ స్వామి అన్నా రు. స్థానిక ప్రభుత్వ డిగ్రీ కళాశాల మైదానంలో వికాస తరంగిణి ఆధ్వర్యంలో సోమ వారం రాత్రి శ్రీరామ పాదుకా పట్టాభిషేకం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన ప్రసంగి స్తూ.. మానవుడు పశు పక్ష్యాదులను ప్రేమిం చాలని, చెట్లను నాటాల న్నారు. హైందవ ధర్మాన్ని రక్షించాలని గుర్తుచేశారు. ఒత్తిడిని జయించాలంటే దైవ చింతన తప్పనిసరి అని, స్వార్ధ బుద్ధిని విడనాడాలన్నారు. వికాస తరంగిణి ద్వారా అనేక సామాజిక కార్య క్రమాలు చేపడుతున్నామని, మహిళ ఆరోగ్యభద్రత కోసం వైద్య శిబిరాలు నిర్వహిస్తు న్నామన్నారు. శ్రీరామ పాదుకుల విశిష్ఠతను వివరించారు. కార్యక్రమంలో వికాస తరంగిణి ప్రతినిధులు వర్మ, మూల వేమన, లమ్మత మధు, రమేష్‌రెడ్డి, వెంకటేశ్వర భక్త బృందం, వికాస తరంగిణి సభ్యులు పాల్గొన్నారు.

ఐక్యంగా ఉండి గ్రామాలను బలోపేతం చేయాలి

నందిగాం, మార్చి 3(ఆంధ్రజ్యోతి): అందరూ కలిసికట్టుగా ఉండి గ్రామాలను బలో పేతం చేసుకోవాలని త్రిదండి చిన్న జీయర్‌ స్వామి హితవుపలికారు. సోమవారం దిమి లాడ, మద్దిలివానిపేట గ్రామాల్లో పర్యటించారు. ప్రతి ఒక్కరు భక్తిభావంతో మెలగడం ద్వారా అభివృద్ధి సాధించ వచ్చ న్నారు. శ్రీరాముని పాదుకలను ప్రతి ఇంట ప్రతిష్ఠించు కొని ఆయన అనుగ్రహాన్ని, శక్తిని సంపాదించుకోవాలని కోరారు. కార్యక్రమంలో వికాస తరంగిణి అధ్యక్షుడు బాలకృష్ణ, రాంబాబు, కె.బాల కృష్ణ స్వామి పాల్గొన్నారు.

భావవేద కళాశాలలో..

కోటబొమ్మాళి, మార్చి 3(ఆంధ్రజ్యోతి): చలమయ్యపేట వద్ద కొండపై నిర్మించిన భావవేద కళాశాలలో సోమవారం త్రిదండి చిన్న జీయర్‌ స్వామి యాగం నిర్వహిం చారు. అనంతరం అన్నదానం చేశారు.

ధర్మ పరిరక్షణకు పాటుపడాలి

సంతబొమ్మాళి, మార్చి 3 (ఆంధ్ర జ్యోతి): ధర్మ పరిరక్షణకు ప్రతి ఒక్కరు పాటుపడాలని త్రిదండి చిన్న జీయర్‌ స్వామి అన్నారు. కోట బొమ్మాళి మండలం తర్లిపేట వద్ద వేదిక్‌ ఆశ్రమంలో భక్తులతో మాట్లా డారు. ప్రతి ఒక్కరు ఆధ్యాత్మిక విలు వలు పెంపొందిం చుకోవాలన్నారు. ప్రకృతిని ఆరాధించా లని, అప్పుడే సంపూర్ణ ఆరోగ్యం సాధ్యమవుతుం దన్నారు. తర్లికొండపై ఆయుర్వేద ఆసుపత్రి, కళాశాల నిర్మించాలన్న సంకల్పంతో ముం దుకు సాగుతున్నామన్నారు. అనంతరం గోపూజ చేశారు. కార్య క్రమంలో సామాజిక వ్యాపారవేత్త డాక్టర్‌ సూర శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Mar 03 , 2025 | 11:54 PM