suicide కుటుంబ కలహాలతో వ్యక్తి ఆత్మహత్య
ABN , Publish Date - Jan 04 , 2025 | 11:58 PM
suicide నగరంపల్లి గ్రామానికి చెందిన దుబ్బ చంద్రయ్య (53) కుటుంబ కలహాల నేపథ్యంలో ఊరుపోసుకొని ఆత్మ హత్య చేసుకున్నాడు.

వజ్రపుకొత్తూరు, జనవరి 4 (ఆంధ్రజ్యోతి): నగరంపల్లి గ్రామానికి చెందిన దుబ్బ చంద్రయ్య (53) కుటుంబ కలహాల నేపథ్యంలో ఊరుపోసుకొని ఆత్మ హత్య చేసుకున్నాడు. ఏఎస్‌ఐ జూన్నారావు తెలిపిన వివరాలిలా ఉన్నాయి.. చంద్రయ్య నిత్యం మద్యం సేవించి కుటుంబ సభ్యులతో గొడవ పడుతుండే వాడు. తన మాటకు ఎవరు ఎదురు చెప్పినా సహించేవాడు కాదు. దీంతో కుటుంబ సభ్యులు అతనితో పెద్దగా మాట్లాడేవారు కాదు. తను వేరుగా ఇంట్లో ఒక గదిలో పడుకొనేవాడు. ఈ నేప థ్యంలో శుక్రవారం రాత్రి భోజనం అయిన తరువాత అందరూ నిద్ర పోయిన సమయంలో తన గదిలో ఉన్న ఫ్యాన్‌కు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. శనివారం ఉదయం తలు పుతీయకపోవడంతో గ్రామస్థుల సహకారంతో తలుపులు పగలగొట్టి చూడగా చంద్రయ్య ఆత్మహత్య చేసుకుని ఉన్నాడు. వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వగా ఏఎస్‌ఐ జూన్నారావు ఘటనా స్థలానికి చేరుకుని పరిశీ లించారు. శవ పంచనామా అనంతరం పోస్టుమార్టం నిమిత్తం పలాస ప్రభు త్వ ఆసు పత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఏఎస్‌ఐ తెలిపారు. మృతునిడి భార్య శ్రీదేవి, కుమార్తె, కుమా రుడు ఉన్నారు. చంద్రయ్య జీడి ఫ్యాక్టరీలో పనిచేస్తున్నట్లు గ్రామస్థులు తెలిపారు.
అత్యాచారం కేసులో వ్యక్తి అరెస్టు
లావేరు, జనవరి 4(ఆంధ్రజ్యోతి): అత్యాచారం కేసులో బొంతు పేట గ్రామానికి చెందిన మండల లక్ష్మణరావును అరెస్టు చేసినట్టు జేఆర్‌పురం పీఐ ఎం.అవతారం తెలిపారు. శనివారం ఆయన తెలి పిన వివరాల మేరకు.. గత నెల 26న మండలంలోని ఓ గ్రామానికి చెందిన యువతిపై లక్ష్మణరావు అత్యాచారానికి పాల్పడ్డాడు. దీంతో ఆమె లావేరు పోలీసుస్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. సీఐ అవతారం విచారణ చేపట్టి నిందితుడిని అరెస్టు చేసి కోర్టులో హాజరుపరిచారు. న్యాయస్థానం అతడికి రిమాండ్ విధించినట్టు సీఐ తెలిపారు.
మద్యంతో వ్యక్తి..
సోంపేట, జనవరి 4(ఆంధ్రజ్యోతి): జింకిభద్ర జంక్షన్ వద్ద మద్యం అమ్ముతున్న శ్యామసుందర్‌ను అరెస్టు చేసినట్టు ఎస్‌ఐ లవరాజు తెలిపారు. శనివారం ఉదయం నిర్వహించిన తనిఖీ ల్లో పట్టుబడ్డాడని.. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్‌ఐ తెలిపారు.