Share News

success meet ‘తండేల్‌’ సక్సెస్‌ మీట్‌ విజయవంతం చేయండి

ABN , Publish Date - Feb 13 , 2025 | 12:12 AM

నగరంలోని ఆర్ట్స్‌ కళా శాల మైదానంలో 13వ తేది గు రువారం సాయంత్రం తండేల్‌ చిత్ర యూనిట్‌ సందడి చేయనున్నట్టు చిత్ర నిర్మాత బన్నీ వాసు తెలిపారు.

success meet ‘తండేల్‌’ సక్సెస్‌ మీట్‌ విజయవంతం చేయండి
మాట్లాడుతున్న చిత్ర నిర్మాత బన్నీ వాసు

శ్రీకాకుళం అర్బన్‌, ఫిబ్రవరి 12 (ఆంధ్రజ్యోతి): నగరంలోని ఆర్ట్స్‌ కళా శాల మైదానంలో 13వ తేది గు రువారం సాయంత్రం తండేల్‌ చిత్ర యూనిట్‌ సందడి చేయనున్నట్టు చిత్ర నిర్మాత బన్నీ వాసు తెలిపారు. ఓ ప్రైవేట్‌ హోటల్‌లో బుధవారం సాయంత్రం నిర్వహించిన విలేఖరుల సమావేశంలో నిర్మాత బన్నీ వాసు మాట్లాడుతూ.. సిక్కోలు మత్స్యకారు లకు సంబంధించిన ఓ యదార్థ గాధ ఆధారంగా తెరకెక్కించిన తండేల్‌ చిత్రాన్ని ప్రేక్షకులు ఆదరించి విజయవంతం చేయడం ఆనందంగా ఉందన్నారు. ఈ సందర్భంగా చిత్ర సక్సెస్‌ మీట్‌ను శ్రీకాకుళంలోనే చేయాలని నిర్ణయించామన్నారు. ఈ సక్సెస్‌ మీట్‌కు తక్కువ సమయం ఉండడంతో ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నామన్నారు. ఈ సక్సెస్‌ మీట్‌కు చిత్ర హీరో నాగచైతన్య, హీరోయిన్‌ సాయిపల్లవి, సంగీత దర్శకుడు దేవిశ్రీప్రసాద్‌ హాజరవుతారని చెప్పారు. సమావేశంలో చిత్ర కథా రచయిత కార్తీక్‌ తీడ పాల్గొనగా, నిర్మాత, రచయితలను అక్కినేని అభిమాన సంఘం ప్రతినిధులు గురుచరణ్‌, సంతోష్‌ పుష్పగుచ్ఛం అందించి గజమాలతో సత్కరించారు.

Updated Date - Feb 13 , 2025 | 12:12 AM