malaria మలేరియా రహిత జిల్లాగా తీర్చిదిద్దాలి
ABN , Publish Date - Mar 06 , 2025 | 12:29 AM
మలేరియా రహిత జిల్లాగా తీర్చిదిద్దాలని, సీజనల్, ఇతర అంటువ్యాధులు ప్రబల కుండా చర్యలు తీసుకోవాలని వైద్య ఆరోగ్య శాఖా రాష్ట్ర అదన పు సంచాలకులు (మలేరియా) డాక్టర్ బి.సుబ్రహ్మణ్యేశ్వరి, డీ ఎంహెచ్‌వో డాక్టర్ టీవీ బాల మురళీకృష్ణ వైద్యాధికారులకు పిలుపునిచ్చారు.
వైద్య ఆరోగ్య శాఖా రాష్ట్ర అదనపు సంచాలకులు సుబ్రహ్మణ్యేశ్వరి
అరసవల్లి, మార్చి 5(ఆంధ్రజ్యోతి): మలేరియా రహిత జిల్లాగా తీర్చిదిద్దాలని, సీజనల్, ఇతర అంటువ్యాధులు ప్రబల కుండా చర్యలు తీసుకోవాలని వైద్య ఆరోగ్య శాఖా రాష్ట్ర అదన పు సంచాలకులు (మలేరియా) డాక్టర్ బి.సుబ్రహ్మణ్యేశ్వరి, డీ ఎంహెచ్‌వో డాక్టర్ టీవీ బాల మురళీకృష్ణ వైద్యాధికారులకు పిలుపునిచ్చారు. పీహెచ్‌సీ, సీహెచ్‌సీ, యూపీహెచ్‌సీ, ఏరియా ఆసుపత్రుల వైద్యాధికారులతో బుధవారం జిల్లా వైద్యారోగ్యశాఖ కార్యాలయ సమావేశ మంది రంలో సమీక్షించారు. మలేరియా, డెంగ్యూ, చికెన్ గున్యా, అతిసారం, వడదెబ్బ తదితర వ్యాధుల వ్యాప్తి, అరికట్టడానికి తీసుకోవాల్సిన చర్యలపై స మీక్షించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడు తూ.. జిల్లాలో వ్యాధులు విజృంభించకుండా చూ డాల్సిన బాధ్యత వైద్యాధికారులపైనే ఉందన్నారు. ఏఎన్‌ఎంలను చైతన్యపరచి, క్షేత్రస్థాయిలో వివిధ రకాల వ్యాధులకు అరికట్టడానికి తీసుకోవాల్సిన జాగ్రత చర్యలపై ప్రజలకు అవగాహన కలిగిం చాలన్నారు. అలాగే యాప్‌ల్లో అప్‌లోడ్ చేసేట ప్పుడు, ప్రభుత్వానికి నివేదికలను పంపించేట ప్పుడు, ఒకటికి రెండుసార్లు సరిచూసుకుని కచ్చితమైన వివరాలు పంపించాలన్నారు. వచ్చే వేసవిలో వడదెబ్బకు గురికాకుండా అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని, ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని సూచించారు. సమా వేశంలో జోనల్ మలేరియా అధికారి శాంతిప్రభ, జిల్లా మలేరియా అధికారి టీవీ సత్యనారాయణ, స్టేట్ కన్సల్టెంట్ శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు.