Saudi Arabia: సౌదీ అరేబియాలో ఎం.మరువాడ వాసి మృతి
ABN , Publish Date - Feb 24 , 2025 | 11:59 PM
Expatriate death in Saudi Arabia సంతబొమ్మాళి మండలం ఎం.మరువాడకు చెందిన కొవిరి రామారావు(37) సౌదీ అరేబియాలో ఆదివారం రాత్రి అనారోగ్యంతో మృతి చెందాడు.

సంతబొమ్మాళి, ఫిబ్రవరి 24(ఆంధ్రజ్యోతి): సంతబొమ్మాళి మండలం ఎం.మరువాడకు చెందిన కొవిరి రామారావు(37) సౌదీ అరేబియాలో ఆదివారం రాత్రి అనారోగ్యంతో మృతి చెందాడు. కుటుంబ సభ్యులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి.. రామారావు ఓ ప్రైవేటు కంపెనీలో పనిచేసేందుకు నాలుగు నెలల కిందట సౌదీ వెళ్లాడు. ఆదివారం ఉదయం కడుపులో నొప్పి ఉందని అక్కడి ఆసుపత్రిలో చేరి చికిత్స పొందుతూ రాత్రి మృతి చెందాడు. మృతుడికి భార్య, కుమారుడు, కుమార్తె ఉన్నారు. మృతుడి కుటుంబాన్ని టీడీపీ మత్స్యకార నాయకులు సూరాడ దాసురాజు, సూరాడ ధనరాజ్, మేరుగు నూకయ్య పరామర్శించి ఓదార్చారు. మృతదేహాన్ని గ్రామానికి తీసుకువచ్చేందుకు కేంద్ర, రాష్ట్ర మంత్రులు కింజరాపు రామ్మోహన్‌నాయుడు, అచ్చెన్నాయుడు దృష్టికి తీసుకువెళ్లామన్నారు. తదుపరి చర్యలు తీసుకుంటున్నట్లు మంత్రులు తెలిపారని వారు పేర్కొన్నారు.