Jagan's ప్రజలు ఛీకొట్టినా జగన్ తీరు మారలేదు
ABN , Publish Date - Feb 24 , 2025 | 12:46 AM
మాజీ ము ఖ్యమంత్రి జగన్‌కు ఉన్న అహంకారానికి తగ్గట్టుగానే ప్రజలు తీర్పు ఇచ్చినా ఆయనలో ఎటువంటి మార్పు రాలేదని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు అన్నారు.

కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు
శ్రీకాకుళం ఫిబ్రవరి 23(ఆంధ్రజ్యోతి): మాజీ ము ఖ్యమంత్రి జగన్‌కు ఉన్న అహంకారానికి తగ్గట్టుగానే ప్రజలు తీర్పు ఇచ్చినా ఆయనలో ఎటువంటి మార్పు రాలేదని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు అన్నారు. ఆదివా రం ఆయన టీడీపీ జిల్లా కార్యాలయంలో విలేకరుల తో మాట్లాడారు. ‘ప్రజలు స్పష్టంగా తీర్పు ఇచ్చారు. జగన్‌రెడ్డికి ఉన్న అహంకారానికి తగ్గట్టుగానే సార్వ త్రిక ఎన్నికల్లో ప్రజలు ఛీకొట్టారు. అధికారం, కక్ష సాధింపులు, ఇష్టం వచ్చినట్టు మాట్లాడడం, ఎవరినీ లెక్క చేయకపోవడం, రాజ్యాంగ వ్యవస్థలను తుంగలో తొక్కడం వంటి విషయాలన్నీ చూసిన ప్రజలు కేవలం 11 సీట్లకే వైసీపీని పరిమితం చేశా రు. అయినా ఇప్పటికి జగన్‌రెడ్డి అదే రీతిలో మాట్లాడుతుండడం ఆశ్చర్యం కలుగుతోంది. అసలు వైసీపీ వాళ్లు చేస్తున్న పోరాటం దేనికోసం అంటే వాళ్ల నాయకుడికి ప్రతిపక్ష హోదా రాలేదని పోరా టం చేస్తున్నారంట. మొన్న కూడా చూశాం. వాళ్ల నాయకుడికి జెడ్ ప్లస్ కేటగిరీలో సెక్యూరిటీ కల్పిం చాలట.. అసలు ప్రజల కోసం పోరాటం చేయాలన్న ఆలోచనే జగనరెడ్డికి లేదు. ఆయన కోసం, ఆయనకు సెక్యూరిటీ కోసం మాత్రమే ఆ పార్టీ నాయకులు పోరాటం చేయడం చూస్తున్నారు.’’ అని కేంద్రమంత్రి ఎద్దేవా చేశారు.