Share News

Pawan Kalyan పవన్‌ కల్యాణ్‌ను విమర్శించే అర్హత జగన్‌కు లేదు

ABN , Publish Date - Mar 07 , 2025 | 12:14 AM

జనసేన అధినేత, రాష్ట్ర ఉపముఖ్య మంత్రి పవన్‌ కల్యాణ్‌ను విమర్శించే అర్హత మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డికి లేదని ఎచ్చెర్ల నియోజకవర్గం జనసేన పార్టీ అధ్యక్షుడు విశ్వక్సేన్‌ అన్నారు.

Pawan Kalyan పవన్‌ కల్యాణ్‌ను విమర్శించే అర్హత జగన్‌కు లేదు
రణస్థలం: మాట్లాడుతున్న పార్టీ ఇన్‌చార్జి విశ్వక్సేన్‌

రణస్థలం, మార్చి 6(ఆంధ్ర జ్యోతి): జనసేన అధినేత, రాష్ట్ర ఉపముఖ్య మంత్రి పవన్‌ కల్యాణ్‌ను విమర్శించే అర్హత మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డికి లేదని ఎచ్చెర్ల నియోజకవర్గం జనసేన పార్టీ అధ్యక్షుడు విశ్వక్సేన్‌ అన్నారు. గురువారం మండల కేంద్రంలోని ఓ కల్యాణ మండపంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. జైల్‌ ఖైదీకి ఎక్కవ రాజకీయ నాయకుడికి తక్కువ అర్హత ఉన్న జగన్‌రెడ్డి నిజాయతీ కలిగిన పవన్‌కల్యాణ్‌ను విమర్శించడం విడ్డూరంగా ఉందన్నారు. క్యారెక్టర్‌ లేని దువ్వాడ శ్రీనివాసరావు పవన్‌ కల్యాణ్‌ను విమర్శించే స్థాయి లేదన్నారు. ఈ సందర్భంగా ఫిఠాపురంలో జరగనున్న జనసేన పార్తీ ఆవిర్భావ దినోత్సవానికి సంబంధించిన పోస్టర్లను ఆవిష్కరించారు. సమావేశంలో పార్టీ అర్జున్‌ భూపతి, బస్వా గోవిందరెడ్డి, తమ్మినేని శ్రీను, వడ్డాది శ్రీను, బొంతు విజయ్‌కుమార్‌, టి.పైడిరాజు, దాసరి బలరామ్‌, వీరమహిళ స్వన్న

ప్రజలు బుద్ధి చెప్పినా జగన్‌ తీరు మారలేదు

బూర్జ, మార్చి 6(ఆంధ్రజ్యోతి): గడిచిన సార్వత్రిక ఎన్నికల్లో వైసీపీకి ప్రజలు బుద్ధి చెప్పినా జగన్‌ తీరు మారలేదని జనసేన పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి కొల్ల జయరాం ధ్వజమెత్తారు. విలేకరులతో ఆయన గురువారం మాట్లాడారు. తమ పార్టీ అధినేత, డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌పై జగన్‌రెడ్డి మాట్లాడిన తీరు సరికాదన్నారు. పవన్‌ కల్యాణ్‌కు ఏ విషయంలోనూ జగన్‌రెడ్డి సరిపోరన్నారు. అవినీతిలో కూరికుపోయిన జగన్‌రెడ్డికి పవన్‌ కల్యాణ్‌పై మాట్లాడే అర్హత కూడా లేదన్నారు. ఇప్పటికైనా మాజీ సీఎం తన మాటలను వెనక్కి తీసుకోవాలని లేదంటే జనసైనికుల ఆగ్రహానికి గురికాక తప్పదన్నారు.

Updated Date - Mar 07 , 2025 | 12:14 AM