మెళియాపుట్టిలో ఐటీడీఏ ఏర్పాటు చేయాలి
ABN , Publish Date - Jan 12 , 2025 | 12:03 AM
మెళియాపుట్టిలో ఐటీడీఏ ఏర్పాటు చేయాలని సీపీఎంఎల్ న్యూడెమోక్రసీ ఆధ్వర్యంలో శనివారం నిరసన తెలిపారు. మెళియాపుట్టి మూడురోడ్ల కూడలి నుంచి తహసీల్దార్ కార్యాలయం వరకు ర్యాలీ చేసి తహసీల్దార్‌కార్యాలయం వద్ద ఆందోళనచేశారు.

మెళియాపుట్టి, జనవరి11(ఆంధ్రజ్యోతి): మెళియాపుట్టిలో ఐటీడీఏ ఏర్పాటు చేయాలని సీపీఎంఎల్ న్యూడెమోక్రసీ ఆధ్వర్యంలో శనివారం నిరసన తెలిపారు. మెళియాపుట్టి మూడురోడ్ల కూడలి నుంచి తహసీల్దార్ కార్యాలయం వరకు ర్యాలీ చేసి తహసీల్దార్‌కార్యాలయం వద్ద ఆందోళనచేశారు. ఈసందర్భంగా న్యూ డెమో క్రసీ రాష్ట్రకార్యదర్శి వంకల మాధవరావు మాట్లాడుతూ సాయుధగిరిజన రైతాంగ పోరాటం తర్వాత దేఽశవ్యాప్తంగా ఐటీడీఏలు ఏర్పాటుచేశారన్నారు. ఎనిమిది నియో జకవర్గాలతో ఏర్పడిన జిల్లాలో 16 మండలాల్లో గిరిజనులు ఉన్నారన్నారని తెలి పారు.వైసీపీ ప్రభుత్వం ప్రజల అభిప్రాయం తెలుసుకోకుండానే జిల్లాలను విభజిం చిందని ఆరోపించారు. జిల్లాలోని గిరిజనులుకు ఐటీడీఏ లేకపోవడంతో ఇబ్బం దులుపడుతున్నారని తెలిపారు. కార్యక్రమంలో గిరిజన సంఘం నాయకులు యోగి, మామిడి భీమారావు, వీరాస్వామి, తదితరులు పాల్గొన్నారు.