Irrigation :శివారు ఆయకట్టుకు సాగునీరు
ABN , Publish Date - Jan 07 , 2025 | 12:07 AM
Irrigation : నారాయణపురం కుడి కాలువ ద్వారా వచ్చే ఖరీఫ్ నాటికి శివారు ఆయకట్టుకు సాగునీరందించేలా చర్యలు తీసుకుంటామని ఎచ్చెర్ల ఎమ్మెల్యే నడుకుదిటి ఈశ్వరరావు తెలిపారు.

ఎచ్చెర్ల, జనవరి 6(ఆంధ్రజ్యోతి):నారాయణపురం కుడి కాలువ ద్వారా వచ్చే ఖరీఫ్ నాటికి శివారు ఆయకట్టుకు సాగునీరందించేలా చర్యలు తీసుకుంటామని ఎచ్చెర్ల ఎమ్మెల్యే నడుకుదిటి ఈశ్వరరావు తెలిపారు. సోమవారం మండలంలోని ధర్మవరంలో పల్లె పండగ కార్యక్రమంలో భాగంగా రూ.40 లక్షలతో సీసీ రోడ్ల నిర్మాణానికి శంకు స్థాపన చేశారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామాల్లో మౌలిక సదుపా యాల కల్పనకు కూటమి ప్రభుత్వం ప్రాధాన్యం ఇస్తున్నట్లు తెలిపారు. కొంతమంది రాజకీయ నాయకుల స్వార్ధం వల్ల అభివృద్ధి ఆగకూడదన్న దృష్ట్యా ప్రభుత్వంలో ఉన్న పెద్దలతో చర్చించి ఈ పనులను శ్రీకారం చుట్టినట్టు చెప్పారు.కార్యక్రమంలో జిల్లా టీడీపీ మాజీ అధ్యక్షుడు చౌదరి నారాయణమూర్తి, బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు పైడి వేణుగోపాలం,పార్టీ మండలాధ్యక్షుడు బెండు మల్లేశ్వరరావు, కళింగ కార్పొరేషన్ డైరెక్టర్ అన్నెపు భువనేశ్వరరావు, కూటమి నేతలు గాలి వెంకటరెడ్డి, పంచిరెడ్డి కృష్ణారావు, రుప్ప రమేష్ తదితరులు పాల్గొన్నారు.