police: ఒక్క క్లిక్‌తో సమాచారం
ABN , Publish Date - Jan 25 , 2025 | 12:16 AM
new web site జిల్లా పోలీసు నూతన వెబ్‌సైట్‌ను శుక్రవారం పోలీసు కార్యాలయంలో ఎస్పీ కె.వి.మహేశ్వరరెడ్డి ఆవిష్కరించారు. ఒక్క క్లిక్‌తో జిల్లా పోలీసు శాఖ మొత్తం సమాచారం అందుబాటులోకి వస్తుందని తెలిపారు.

జిల్లా పోలీసు నూతన వెబ్‌సైట్ ఆవిష్కరణ
శ్రీకాకుళం క్రైం, జనవరి 24(ఆంధ్రజ్యోతి): జిల్లా పోలీసు నూతన వెబ్‌సైట్‌ను శుక్రవారం పోలీసు కార్యాలయంలో ఎస్పీ కె.వి.మహేశ్వరరెడ్డి ఆవిష్కరించారు. ఒక్క క్లిక్‌తో జిల్లా పోలీసు శాఖ మొత్తం సమాచారం అందుబాటులోకి వస్తుందని తెలిపారు. దీని సహాయంతో జిల్లాలో ప్రజలకు పోలీసు సేవలు మరింత చేరువవుతాయన్నారు. ఈ వెబ్‌సైట్‌లో పోలీసు అధికారుల పేర్లు, ఫోన్ నెంబర్లు, అత్యవసర సమయంలో ఉపయోగపడే నెంబర్లు, ఇతర పోలీసు సేవలు, అందుబాటులో ఉంటాయని వెల్లడించారు. కంచిలి మండలం కేసరపడకు చెందిన బీటెక్ విద్యార్థి కొరికాన నవీన్ ఈ వెబ్‌సైట్‌ను రూపొందిచారని తెలిపారు. నవీన్‌తోపాటు వెబ్‌సైట్ రూపకల్పనకు సహకరించిన శ్రీకాకుళం ఎన్‌ఐసీ సెంటర్ డిప్యూటీ డైరెక్టర్ కిరణ్, పోలీసు ఐటీ కోర్ సీఐ శ్రీనివాస్, ఏఎస్‌ఐ రమేష్‌లను అభినందించారు. కార్యక్రమంలో ఏఎస్పీ కె.వి.రమణ, సిబ్బంది పాల్గొన్నారు.