ఉత్తమ నాటికగా ‘ఇంద్రప్రస్థం’
ABN , Publish Date - Feb 12 , 2025 | 12:12 AM
బొరివంక గ్రామంలోని కళింగసీమ కళాపీఠం ఆధ్వర్యంలో మూడు రోజుల పాటు నిర్వహించిన బల్లెడ అనసూయమ్మ స్మారక తెలుగు రాష్ట్రాల ఆహ్వానిత నాటిక పోటీలు అలరిం చాయి.

కవిటి, ఫిబ్రవరి 11(ఆంధ్రజ్యోతి): బొరివంక గ్రామంలోని కళింగసీమ కళాపీఠం ఆధ్వర్యంలో మూడు రోజుల పాటు నిర్వహించిన బల్లెడ అనసూయమ్మ స్మారక తెలుగు రాష్ట్రాల ఆహ్వానిత నాటిక పోటీలు అలరిం చాయి. వీటిలో మానవ సంబంధాల గొప్పతనమే ప్రధాన ఇతివృత్తంగా కనిపించాయి. ఈ పోటీల్లో గుంటూరుకు చెందిన అభినయ ఆర్ట్స్ కళా కారులు ప్రదర్శించిన ‘ఇంద్రప్రస్థం’ నాటిక ఉత్తమ ప్రదర్శనగా ఎంపికైంది. ద్వితీయ ఉత్తమ ప్రదర్శనగా విశాఖపట్నానికి చెందిన తెలుగు కళాసమితి వారి ‘నిశ్శబ్దమా నీ ఖరీదెంత?’, తృతీయ ప్రదర్శనగా గుంటూరు కళాకారుల ‘చిగురు మేఘం’ నాటిక ఎంపికైంది. ‘నిశ్శబ్దమా నీ ఖరీదెంత?లో నటించిన పి.వి.వరప్రసాద్ ఉత్తమ నటుడిగా, డి.హేమ ఉత్తమ విలన్‌గా, ఉత్తమ ఆహార్యంగా ఎస్.రమణ ఎంపికయ్యారు. ‘జనరల్ భోగీలు’లో నటించిన సురభి ప్రభా వతి ఉత్తమ నటిగా, పి.టి.మాధవ్ ఉత్తమ రచయితగా ఎంపిక య్యారు. ‘ఇంద్రప్రస్థం’లో నటించిన ఎన్.రవీంద్రారెడ్డి ఉత్తమ సహాయ నటుడితో పాటు ఉత్తమ దర్శకుడిగా ఎంపికయ్యారు. అదే నాటికకు ఉత్తమ సంగీత దర్శకుడిగా పి.లీలామెహన్, ఉత్తమ రంగాలంకరణకు ఎం.బీమ్‌కుమార్‌లు బహుమతులు అందుకున్నారు. ‘పక్కింటి మొగుడు’ నాటికలో నటించిన యు.వి.శేషయ్య ఉత్తమ హాస్యనటుడిగా ఎంపికయ్యారు. శర్వాణీ ఆర్ట్స్ కళాకారులు ప్రదర్శించిన ‘కొత్త పరిమళం’ నాటిక ఆకట్టుకుంది. ఈ నాటికలో బి.శోభన్, పి.చలపతి, ఎస్.సర్వేశ్వరరావు, చలం నటించారు. విజేతలకు షీల్డులు, నగదు బహుమతులను అందించారు. కళాపీఠం అధ్యక్షుడు బి.లక్ష్మణమూర్తి, విశ్రాంత డీఎస్పీ ఎస్.ప్రసాదరావు, స్థానిక నేతలు పి.నేతాజీ, పి.ప్రసాదరావు, పి.కృష్ణారావు, బి.చిన్నబాబు, ఎం.రామారావు, ఎస్‌వీరమణ, టి.వి.రమణలు విజేతలకు బహుమతి ప్రదానం చేశారు.