Share News

నిధులు లేక.. పనులు జరగక

ABN , Publish Date - Jan 18 , 2025 | 11:54 PM

బైరి సాగునీటి కాలువ శివారు భూములకు సాగునీరు అందించేందుకు అంబళ్ల వలస ఎత్తిపోతల పథకం ఏర్పాటుకోసం వేసిన శిలాఫలకం వెక్కిరిస్తోంది.

నిధులు లేక.. పనులు జరగక
ఎత్తిపోతల పథకం కోసం వేసిన శిలాఫలకం:

గార, జనవరి 18 (ఆంధ్రజ్యోతి): బైరి సాగునీటి కాలువ శివారు భూములకు సాగునీరు అందించేందుకు అంబళ్ల వలస ఎత్తిపోతల పథకం ఏర్పాటుకోసం వేసిన శిలాఫలకం వెక్కిరిస్తోంది. ప్రధానంగా నిధులు లేకపోవడంతో పనులు ముందుకుసాగలేదు. అంబళ్లవలస వద్ద రూ.397 కోట్ల అంచనాతో వైసీపీ ప్రభుత్వ హయాంలో ఎత్తిపోతల పథకం నిర్మాణానికి 2019 ఫిబ్రవరి 13న శంకుస్థాపన చేశారు. వంశధార నదిపై అంబళ్లవలస వద్ద ఎత్తిపోతల పథకం ఏర్పాటుచేసి కొర్ని, కొర్లాం తదితర శివారు గ్రామాల పరిధిలోని రెండు వేల ఎకరాలకు సాగునీరందించేందుకు గతం లో అప్పటి ఎమ్మెల్యే గుండ లక్ష్మీదేవి కూడా భూమి పూజ చేశారు. ఆ తర్వాత అధికారంలోకి వచ్చిన వైసీపీ ప్రభు త్వం ఎత్తిపోతల పథకం పనులపై దృష్టిసారిం చకపోవడంతో పనులు శిలాఫలకం స్థాయి దాటలేదు. శివారు భూ ములకు సాగు నీరందక పంటలు పండక ఇబ్బందిపడుతుండడంతో ఎత్తిపోతల పథకాన్ని పూర్తి చేసి అందుబాటులోకి తీసుకురావాలని ఆయకట్టు రైతులు కోరుతున్నారు.

Updated Date - Jan 18 , 2025 | 11:54 PM