ఐదో తేదీ వరకూ హెలీ టూరిజం: పీడీ
ABN , Publish Date - Feb 03 , 2025 | 11:42 PM
ప్రజల డిమాండ్ మేరకు హెలీ టూరి జం ఐదో తేదీ వరకూ కొనసాగిస్తామని డ్వామా పీడీ భీంపల్లి సుధాకర్ తెలిపా రు. హెలీటూరిజం ద్వారా ఢిల్లీ నుంచి హెలికాప్టర్‌ను తీసుకొచ్చి 2,3,4 తేదీల్లో జిల్లా ప్రజలకు వినువీధిలో విహరించే అవకాశం ప్రభుత్వం కల్పించినట్లు చెప్పా రు.

శ్రీకాకుళంక్రైం,ఫిబ్రవరి 3(ఆంధ్రజ్యోతి): ప్రజల డిమాండ్ మేరకు హెలీ టూరి జం ఐదో తేదీ వరకూ కొనసాగిస్తామని డ్వామా పీడీ భీంపల్లి సుధాకర్ తెలిపా రు. హెలీటూరిజం ద్వారా ఢిల్లీ నుంచి హెలికాప్టర్‌ను తీసుకొచ్చి 2,3,4 తేదీల్లో జిల్లా ప్రజలకు వినువీధిలో విహరించే అవకాశం ప్రభుత్వం కల్పించినట్లు చెప్పా రు. దీనికోసం ఒక్కక్కరికి రెండు వేల రూపాయలు టిక్కెట్ ధర నిర్ణయించగా, కేంద్ర విమానయానశాఖ మంత్రి ఒక్కో టిక్కెట్‌పై సొంతంగా 200లు చెల్లిస్తూ ప్రజలకు 1800కే టిక్కెట్‌ను అందుబాటులోకి తీసుకొచ్చారని తెలిపారు. రెండో తేదీన 200 మంది హెలికాప్టర్‌లో విహారంచేయగా, రూ.3.60 లక్షలు ఆదాయం వచ్చిందని, సోమవారం 270 మంది హెలికాప్టర్ ఎక్కగా, 45 రౌండ్ల తిరగడంతో రూ. 4 లక్షల 86 వేలు ఆదాయం వచ్చినట్లు చెప్పారు. ఆన్‌లైన్‌తో పాటు ఆఫ్‌లైన్ టిక్కెట్లను ఆర్‌అండ్‌బీ బంగ్లా వద్ద విక్రయిస్తున్నట్లు తెలిపారు. కాగా రథసప్తమిని ప్రభుత్వం రాష్ట్రపండగగా ప్రకటించడంతో తొలిసారిగా జిల్లా యంత్రాంగం హెలి కాఫ్టర్ విహారం కార్యక్రమం మూడురోజులపాటు ఏర్పాటుచేసింది. శ్రీకాకుళంలోని డచ్ బిల్డింగ్ వద్ద ఏర్పాటుచేసిన హెలికాఫ్టర్ ద్వారా ప్రతిరోజూ ఉదయం తొమ్మిది నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు పట్టణంలోని వీధుల్లో సంచరిస్తోంది. ఎనిమిది నిమిషాలపాటు హెలికాఫ్టర్‌లో విహరించేలా జిల్లా అధికారులు చర్యలు చేపట్టారు. ఒక ట్రిప్పుకి ఆరుగురు చప్పున రోజుకు 200 నుంచి 250 మందిని హెలికాఫ్టర్‌లో విహరిస్తున్నారు. గగనవీధిలో నుంచి అరసవిల్లి ఆలయ గోపురాన్ని చూసి పర్యాటకులు పులకించిపోతున్నారు.