Share News

Health assistants : హెల్త్‌ అసిస్టెంట్లను విధుల్లోకి తీసుకోవాలి

ABN , Publish Date - Jan 07 , 2025 | 12:09 AM

Health assistants : డీఎస్సీ-2002 ద్వారా హెల్త్‌ అసిస్టెంట్లగా నియ మితులై, 22 ఏళ్లుగా కాంట్రాక్టు విధానంలో పనిచేస్తున్న ఎంపీహెచ్‌ఏ(మేల్‌)లు 920 మందిని విధుల నుంచి తొలగించడం సరికాదని, వారిని వెంటనే విధుల్లోకి తీసుకో వాలని యూనియన్‌ నాయకులు కోరారు.

Health assistants : హెల్త్‌ అసిస్టెంట్లను విధుల్లోకి తీసుకోవాలి
కేంద్రమంత్రికి వినతిపత్రాన్ని అందజేస్తున్న యూనియన్‌ నాయకులు :

అరసవల్లి, జనవరి 6(ఆంధ్రజ్యోతి): డీఎస్సీ-2002 ద్వారా హెల్త్‌ అసిస్టెంట్లగా నియ మితులై, 22 ఏళ్లుగా కాంట్రాక్టు విధానంలో పనిచేస్తున్న ఎంపీహెచ్‌ఏ(మేల్‌)లు 920 మందిని విధుల నుంచి తొలగించడం సరికాదని, వారిని వెంటనే విధుల్లోకి తీసుకో వాలని యూనియన్‌ నాయకులు కోరారు.ఈ మేరకు శ్రీకాకుళంలోని కేంద్ర పౌరవి మానయానశాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్‌నాయుడికి ఆయన నివాసంలో యూని యన్‌నాయకులు సోమవారం వినతిపత్రంఅందజేశారు. ఈసందర్భంగా మాట్లాడుతూ చాలామందికి 50 ఏళ్లు దాటిపోయాయని, ఇన్నేళ్ల సర్వీసు తర్వాత ఉద్యోగాల్లో నుంచి తీసేస్తే కుటుంబాలతో ఎలా జీవించాలని వాపోయారు. ఆరోగ్యశాఖ మంత్రి, ప్రిన్సిపల్‌ సెక్రటరీతో మాట్లాడి అందరికీ న్యాయంచేస్తామని కేంద్రమంత్రి హామీఇచ్చారు. కార్య క్రమంలో యూనియన్‌ నాయకులు బి.మురళి, నాగరాజు,రాంబాబు, శ్రీకాకుళం, విజయ నగరం, విశాఖపట్నం జిల్లాల నుంచి 50 మంది హెల్త్‌అసిస్టెంట్లు పాల్గొన్నారు.

Updated Date - Jan 07 , 2025 | 12:09 AM