Mahalakshmi Kalyanam ఘనంగా మహాలక్ష్మి కల్యాణం
ABN , Publish Date - Feb 08 , 2025 | 12:14 AM
ఉత్తరాంధ్రుల ఇలవేల్పు కమ్మసిగడాం మహాలక్ష్మి అమ్మవారి కల్యాణాన్ని శుక్రవారం రాత్రి 9:25 గంటలకు ఘనంగా నిర్వహించారు. ఉత్తరాంధ్రుల ఇలవేల్పు కమ్మసిగడాం మహాలక్ష్మి అమ్మవారి కల్యాణాన్ని శుక్రవారం రాత్రి 9:25 గంటలకు ఘనంగా నిర్వహించారు.

రణస్థలం, ఫిబ్రవరి 7(ఆంధ్రజ్యోతి): ఉత్తరాంధ్రుల ఇలవేల్పు కమ్మసిగడాం మహాలక్ష్మి అమ్మవారి కల్యాణాన్ని శుక్రవారం రాత్రి 9:25 గంటలకు ఘనంగా నిర్వహించారు. నడిపల్లి గ్రామానికి చెందిన సిద్ధాంతి కుటుంబీకులు అమ్మ వారికి చీర, మంగళ సూత్రాలు సమర్పించారు. బంటుపల్లి మునసబు కుటుంబీకులు పల్లకిని తెచ్చారు. అనంతరం అమ్మవారి కల్యాణాన్ని వైభవంగా నిర్వహించారు. అధిక సంఖ్యలో భక్తులు హాజరై కల్యాణ వేడుకలను తిల కించారు. ఆలయ ప్రాంగణం భక్తులతో కిటకిటలాడింది. కల్యాణం అనంతరం జాతర ప్రారంభమైంది. జేఆర్‌పురం సీఐ ఎం.అవతారం ఆధ్వర్యంలో బందోబస్తు నిర్వహిస్తు న్నారు. జాతరలో శాంతిభద్రతలకు విఘాతం కలగకుండా పోలీస్ ఔట్ పోస్టు ఏర్పాటు చేశారు. అమ్మవారి దర్శనానికి వచ్చే భక్తులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా ఎమ్మెల్యే నడుకుదిటి ఈశ్వరరావు, ఆలయ కమిటీ అధ్యక్షుడు వి.వి.వి. ప్రసాద్ ఆధ్వర్యంలో సౌకర్యాలు కల్పిస్తున్నారు.