Share News

Bhadramahankali: ఘనంగా భద్రమహంకాళి జాతర

ABN , Publish Date - Jan 16 , 2025 | 12:15 AM

Bhadramahankali: కోటపాలెం లోని భద్రమహంకాళి తల్లి జాతర బుధవారం ఘనంగా జరిగింది.

Bhadramahankali: ఘనంగా భద్రమహంకాళి జాతర
భద్రమహంకాళి దర్శనం కోసం బారులు తీరిన భక్తులు

రణస్థలం, జనవరి 15 (ఆంధ్రజ్యోతి): కోటపాలెం లోని భద్రమహంకాళి తల్లి జాతర బుధవారం ఘనంగా జరిగింది. జిల్లాతో పాటు విశాఖపట్నం, విజయనగరం జిల్లాల నుంచి అధిక సంఖ్యలో భక్తులు తరలివచ్చి అమ్మవారిని దర్శించుకున్నారు. భక్తుల వినోదం కోసం పలు సాంస్కృతిక కార్యక్రమాలను కమిటీ సభ్యులు ఏర్పాటు చేశారు. జేఆర్‌పురం పోలీసులు బందోబస్తు నిర్వహించారు.

ఉల్లాసంగా కోడె బండ్ల..

పొందూరు, జనవరి(ఆంద్రజ్యోతి) 15 : మండల కేంద్రంతో పాటు లోలుగు, రాపాక గ్రామాల్లో బుధవారం సంక్రాంతి సందర్భంగా పలు గ్రామాలల్లో కోడేబల్లు కోడె బండ్ల జాత ర ఉత్సాహంగా జరిగింది. ఈ జాతరలో యువకులు ఉత్సాహంగా పాల్గొన్నారు.

బూర్జలో చాకలి లచ్చమాంబ..

బూర్జ,జనవరి 15 (ఆంధ్రజ్యోతి): బూర్జలో చాకలి లచ్చమాంబ పేరంటాల జాతరను గ్రామస్థులు బుధవారం వైభవంగా నిర్వహిం చారు. ఉదయం నుంచే వందలాది మంది భక్తులు లచ్చమాంబను దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు.

Updated Date - Jan 16 , 2025 | 12:15 AM