Govt. Schemes అర్హులందరికీ ప్రభుత్వ పథకాలు
ABN , Publish Date - Feb 16 , 2025 | 11:44 PM
Govt. Schemes అర్హత ఉన్న ప్రతి ఒక్కరికీ ప్రభుత్వ పథకాలు అందిస్తా మని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు అన్నారు.
మంత్రి అచ్చెన్నాయుడు
కోటబొమ్మాళి, ఫిబ్రవరి 16(ఆంధజ్యోతి): అర్హత ఉన్న ప్రతి ఒక్కరికీ ప్రభుత్వ పథకాలు అందిస్తా మని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు అన్నారు. ఆదివారం నిమ్మాడలోని తన క్యాంపు కార్యాలయంలో ప్రజల నుంచి వినతులు స్వీకరించారు. జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి ప్రజలు అధిక సంఖ్యలో వచ్చి తమ సమస్యలు విన్నవించుకున్నారు. ఈ వినతులపై సంబంధిత అధికారులతో మాట్లాడి త్వరితగతిన ప్రజలకు మేలు చేకూరేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ప్రధానంగా ఇళ్లు, పింఛన్ల మంజూరు, ఉపాధి అవకాశాలు, రోడ్లు మంజూరు చేయాలని ప్రజలు కోరారు.
ఎర్రన్న ఘాట్‌ను సందర్శించిన మంత్రులు
నిమ్మాడలోని దివంగత నేత మాజీ కేంద్ర మంత్రి కింజరాపు ఎర్రన్నాయుడు ఘాట్‌ను కేంద్ర మంత్రి కింజరాపు రామ్మోహన్‌నాయుడు, రాష్ట్ర మంత్రి అచ్చెన్నాయుడు ఆదివారం సందర్శించారు. ఈనెల 23న ఎర్రన్నాయుడు జయంతి వేడుకల నిర్వహణపై ఆయన సోద రులు కింజరాపు ప్రభా కర్, హరివరప్రసాద్‌లతో చర్చించారు. కార్యక్రమంలో పలువురు పార్టీ నేతలు పాల్గొన్నారు.