Share News

Road Accident పూర్వ విద్యార్థులసమావేశానికి వెళ్లి వస్తూ..

ABN , Publish Date - Jan 18 , 2025 | 11:50 PM

Road Accident పాలకొండ-శ్రీకాకుళం రోడ్డులో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ ఆర్మీ జవాన్‌ దుర్మరణం పాలయ్యాడు.

Road Accident పూర్వ విద్యార్థులసమావేశానికి వెళ్లి వస్తూ..
అధికార లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహిస్తున్న దృశ్యం (ఇన్‌సెట్‌లో) దుష్యంత్‌ (ఫైల్‌)

లబోదిబోమంటున్న కుటుంబసభ్యులు

ఆమదాలవలస, జనవరి 18 (ఆంధ్రజ్యోతి): పాలకొండ-శ్రీకాకుళం రోడ్డులో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ ఆర్మీ జవాన్‌ దుర్మరణం పాలయ్యాడు. పోలీ సులు, స్థానికుల కథనం మేరకు.. రేగిడి మండలం ఉంగరాడమెట్టలో ఆర్మీ జవాన్‌ గొర్లె దుష్యంత్‌ (చిన్ని) (26) స్థిర నివాసం ఏర్పాటు చేసుకున్నాడు. సంక్రాంతిని పురస్కరించుకుని శుక్రవారం పాలకొండలో పూర్వ విద్యార్థుల సమావేశంలో పాల్గొని సాయంత్రం సొంతూరు ఆమదాలవలస మండలం దన్నానపేట ద్విచక్ర వాహనంపై వెళ్తున్నాడు. ఈ క్రమంలో ఆమదాలవలస, బూర్జ మండలాల సరిహద్దులో ఉప్పినివలస-అక్కులపేట వద్ద ద్విచక్ర వాహనం బోల్తాపడి అక్కడిక్కడే మృతి చెందాడు. ఈ ప్రమాదం జరిగిన వెంటనే చిన్ని మృతి చెందగా స్థానికులు గుర్తించి కుటుంబ సభ్యులకు సమా చారం అందించారు. తక్షణమే ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించినా అప్పటికే మృతి చెందాడు. ఈ విషయం తెలియడంతో ఉంగరాడమెట్ట, దన్నా నపేట ల్లో విషాదఛాయలు అలముకున్నాయి. చిన్ని తల్లిదండ్రులు గొర్లె జగన్నాథ రావు, రమాదేవి కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. తండ్రి ఉంగ రాడమెట్ట వద్ద ఓ ప్రైవేటు కంపెనీలో వెల్డర్‌గా పని చేయగా, తల్లి రమాదేవి గృహిణి కాగా, ఓ అన్నయ్య ఉన్నాడు. ఈ మేరకు బూర్జ ఎస్‌ఐ ఎం.ప్రవల్లిక కేసు నమోదు చేశారు. మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు అప్పగించారు. కాగా దన్నానపేటలో శనివారం దుష్యంత్‌ అంత్యక్రియలను అధికార లాంఛనాల తో జరిగాయి. బూర్జ, ఆమదాలవలస ఎస్‌ఐలు ప్రవల్లిక, బాలరాజు, పోలీస్‌ సిబ్బంది గాలిలోకి మూడు రౌండ్లు కాల్పులు జరిపి గౌరవందనం చేశారు.

స్నేహితులతో కలిసి..

పాలకొండలోని ఓ ప్రైవేటు విద్యాసంస్థలో చిన్ని విద్యను అభ్యసించాడు. సంక్రాంతి సందర్భంగా శుక్రవారం పూర్వ విద్యార్థుల సమావేశం ఏర్పాటు చేసుకున్నారు. ఈ వేడుకల్లో పాల్గొన్న చిన్ని స్నేహితులతో సందడిగా గడి పాడు. అనంతరం దన్నానపేట బయలుదేరి వెళ్తుండగా ద్విచక్రవాహనం బోల్తాపడింది. సంక్రాంతి సెలవులు ముగియడంతో వీఽధుల్లో చేరేందుకు సిద్ధమవుతున్న తరుణంలో ఈ ఘటన చోటుచేసుకుంది.

Updated Date - Jan 18 , 2025 | 11:50 PM