Share News

identify different talents ఇంటింటికీ వెళ్లి విభిన్న ప్రతిభావంతులను గుర్తించాలి

ABN , Publish Date - Feb 07 , 2025 | 11:43 PM

identify different talents గ్రామాల్లో ఇంటింటికీ వెళ్లి విభిన్న ప్రతిభా వంతు లను గుర్తించాలని సీని యర్‌ సివిల్‌ న్యాయాధి కారి జె.శ్రీనివాసరావు అన్నారు.

identify different talents  ఇంటింటికీ వెళ్లి విభిన్న ప్రతిభావంతులను గుర్తించాలి
డీఈఐసీ కేంద్రాన్ని పరిశీలిస్తున్న సీనియర్‌ సివిల్‌ న్యాయాధికారి శ్రీనివాసరావు

టెక్కలి, ఫిబ్రవరి 7(ఆంధ్రజ్యోతి): గ్రామాల్లో ఇంటింటికీ వెళ్లి విభిన్న ప్రతిభా వంతు లను గుర్తించాలని సీని యర్‌ సివిల్‌ న్యాయాధి కారి జె.శ్రీనివాసరావు అన్నారు. స్థానిక జిల్లా కేంద్ర ఆసుపత్రిలోని జిల్లా ప్రారంభ జోక్య కేంద్రం (డీఈఐసీ)ని శుక్రవారం ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా విభిన్న ప్రతిభావంతులైన పిల్లలకు అందిస్తున్న వైద్యసేవలపై ఆరాతీశారు. వీరికి ఎటువంటి వైద్య సదుపాయాలు అవసరమో గుర్తించాలని సిబ్బందికి సూచించారు. కార్యక్రమంలో డిప్యూటీ డీఎంహెచ్‌వో డాక్టర్‌ మేరీకేథరిన్‌, ఆసుపత్రి సూపరింటెండెంట్‌ డాక్టర్‌ బి.సూర్యారావు, ఆర్‌ఎంవో డాక్టర్‌ మహరాజ్‌, డీఈఐసీ అధికారి డాక్టర్‌ రాజశేఖర్‌, మేనేజర్‌ అప్పలనాయుడు తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Feb 07 , 2025 | 11:43 PM