Lord Venugopala వైభవంగా వేణుగోపాల స్వామి కల్యాణం
ABN , Publish Date - Feb 13 , 2025 | 12:19 AM
శాలిహుండం వద్ద ప్రసిద్ధ శ్వేతగిరిపై గల వేణుగోపాల స్వామి వారి కల్యాణ మహోత్స వం బుధవారం వైభవంగా జరిగింది.

గార, ఫిబ్రవరి 12(ఆం ధ్రజ్యోతి): శాలిహుండం వద్ద ప్రసిద్ధ శ్వేతగిరిపై గల వేణుగోపాల స్వామి వారి కల్యాణ మహోత్స వం బుధవారం వైభవంగా జరిగింది. అర్చకలు మహీంద్రాడ రవికుమా ర్, ఇతర అర్చక బృందం వేద మంత్రాలతో పూజా కార్యక్రమాలు నిర్వహించారు. పూజా కార్యక్రమాల్లో ఎమ్మెల్యే గొండు శంకర్ దంపతులు, వైద్యులు కింజరాపు శ్రీనివాసులు నాయుడు దంపతులు, న్యాయాధికారి కొంక్యాన సుభాష్ దంపతులు పాల్గొని స్వామి వారి కల్యాణం నిర్వహించారు. ట్రస్ట్ బోర్డు చైర్మన్ సుగ్గు మధురెడ్డి, ఎంపీటీసీ లక్ష్మీ నరసింహదేవి దంపతులు, రిటైర్డు ఏఈ పల్లి నర్సింహులు తదితరులు పాల్గొన్నారు.