Gambling: సరిహద్దులో పేకాట.. అంతా టోకెన్లతోనే!
ABN , Publish Date - Jan 16 , 2025 | 11:37 PM
Border Gambling సంకాంత్రి వేళ ఆంరఽధా -ఒడిశా సరిహద్దులోని తోటల్లో పేకాట శిబిరాలు జోరుగా సాగుతు న్నాయి. సరిహద్దు గ్రామాలైన గారబంద, గోసాని, ఏడోమైలు, గొప్పిలి-పట్టుపురం, లావణ్యకోట తదితర గ్రామాల్లో ఎత్తయిన కొండలు, తోటలు ఉన్నాయి. వీటిని పేకాటరాయుళ్లు తమ స్థావరా లుగా మార్చుకున్నారు.

ఆడాలంటే ఫీజు రూ.1500 కట్టాల్సిందే
ఆంధ్ర-ఒడిశా చివరి గ్రామాల్లో శిబిరాలు
ప్రైవేట్ సిబ్బందితో రెండంచెల భద్రత
ఒడిశా పోలీసులు పట్టుకోరు.. మన పోలీసులూ వెళ్లలేరు!
మెళియాపుట్టి, జనవరి 16(ఆంధ్రజ్యోతి): సంకాంత్రి వేళ ఆంరఽధా -ఒడిశా సరిహద్దులోని తోటల్లో పేకాట శిబిరాలు జోరుగా సాగుతు న్నాయి. సరిహద్దు గ్రామాలైన గారబంద, గోసాని, ఏడోమైలు, గొప్పిలి-పట్టుపురం, లావణ్యకోట తదితర గ్రామాల్లో ఎత్తయిన కొండలు, తోటలు ఉన్నాయి. వీటిని పేకాటరాయుళ్లు తమ స్థావరా లుగా మార్చుకున్నారు. రోజుకొక స్థావరంలో పేకాట శిబిరాలు నిర్వ హిస్తున్నట్లు సమాచారం. దీనికోసం ప్రైవేటు వ్యక్తులతో రెండంచెల భద్రత ఏర్పాటు చేసుకున్నట్లు తెలుస్తోంది. పేకాట శిబిరానికి వచ్చే వారి వాహనాలను రెండు కిలోమీటర్ల దూరంలోనే వీరు అడ్డుకుం టారు. అక్కడ నుంచి తమ వాహనాల్లో మాత్రమే పేకాటరాయు ళ్లను శిబిరానికి తీసుకొని వెళ్తారు. టెక్కలి, పలాస, ఇచ్ఛాపురం, మందస, పాతపట్నం, కోటబోమ్మాళి, నందిగాం, కొత్తూరు, కంచిలి, కవిటి మండలాలతోపాటు జిల్లా కేంద్రం శ్రీకాకుళం నుంచి అధికంగా పేకాట రాయుళ్లు వస్తున్నట్లు సమాచారం. ఈ శిబిరాల విషయం ఒడిశా పోలీసు లకు తెలిసినా దాడులు చేయడం లేదనే విమర్శలు ఉన్నాయి. మన పోలీసులకు తెలిసినా అక్కడకు వెళ్లలేని పరిస్థితి నెలకొంది.
టోకెన్ తీసుకుంటేనే ఎంట్రీ..
పేకాట శిబిరాలను ఒడిశాకు చెందిన కొంతమంది వ్యక్తులు నిర్వహిస్తున్నట్లు సమాచారం. పోలీసులు దాడి చేస్తే వారికి నగదు పట్టుబడకుండా నిర్వాహకులు పక్కాగా ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలుస్తోంది. దీనికోసం టోకెన్ల ద్వారా లావాదేవీలు నిర్వహిస్తున్నారు. పేకాటకు వచ్చేవారు రూ.1500 చెల్లించి ఎంట్రీ టోకెన్ తీసుకోవాలి. తరువాత రూ.5వేల నుంచి రూ.3లక్షల విలువ చేసే టోకెన్లు తీసుకోవాలి. ఆట గెలిచిన వ్యక్తులు చివరిలో సెక్యూరిటీకి ఆ టోకెన్ ఇస్తే అందుకు తగ్గ నగదును వారికి అందించేలా ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఎవరి వద్దనైనా డబ్బులు లేకపోతే వారితో ప్రామిసరీ నోట్లపై సంతకాలు పెట్టించుకుని నిర్వాహకులే అధిక వడ్డీకి డబ్బులు ఇస్తున్నట్లు సమాచారం. ప్రతిరోజూ 30 నుంచి 50 మంది వరకు పేకాట శిబిరాలకు వస్తున్నట్లు తెలుస్తోంది. వీరికి మధ్యాహ్న భోజనం, సాయంత్రం టీ, బిస్కెట్ కూడా నిర్వహకులు అందిస్తున్నారు. ఆంరఽధా పోలీసులకు అనుమానం రాకుండా పేకాటరాయుళ్లు రోజుకొక వాహనంపై వస్తున్నట్లు తెలుస్తోంది.
పట్టించుకోని గత ప్రభుత్వం
ఆంధ్రా-ఒడిశా సరిహద్దుల్లో పేకాట శిబిరాలు జరుగుతున్నా గత వైసీపీ ప్రభుత్వం పట్టించుకోలేదు. గతంలో ప్రతి నెల ఒడిశా, ఆంధ్రా పోలీసులకు పేకాట నిర్వాహకులు మామ్మూళ్లు అందించేవారనే ఆరోపణలు ఉన్నాయి. కొంతమంది వైసీపీ నాయకుల ద్వారా పోలీసులను మేనెజ్ చేయించేవారనే విమర్శలు ఉన్నాయి. దీంతో సరిహద్దులో జోరుగా పేకాట శిబిరాలు కొనసాగుతున్నా పోలీసులు పట్టించుకోనేవారు కాదు. అయితే కూటమి ప్రభుత్వం వచ్చిన తరువాత గంజాయి, పేకాట శిబిరాలపై ఉక్కుపాదం మోపుతున్న విషయం తెలిసిందే. అయినా గతంలో అటవాటు పడిన పేకాటరాయుళ్లు.. ఇంకా సరిహద్దుకు వెళ్లి శిబిరాలు నిర్వహిస్తున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం సంక్రాంతి పండుగ వేళ.. గ్రామాల్లో పేకాడేవారిపై పోలీసులు ప్రత్యేక బృందాలతో నిఘా పెట్టారు.
నిఘా పెట్టాం..
సరిహద్దు ప్రాంతాల్లో నిర్వహిస్తున్న పేకాట శిబిరాలపై నిఘా పెట్టాం. అవి ఒడిశా ప్రాంతాలు కావడంతో వెళ్లలేని పరిస్థితి. ఒడిశా పోలీసుల సహకారం తీసుకొని దాడులు చేస్తాం. గ్రామాల్లో పేకాట శిబిరాలు ఏర్పాటు చేస్తే కేసులు నమోదు చేస్తాం.
-పిన్నింటి రమేష్‌బాబు, ఎస్‌ఐ, మెళియాపుట్టి