Share News

భర్తకు భార్య అంత్యక్రియలు

ABN , Publish Date - Jan 25 , 2025 | 12:12 AM

భర్తకు భార్య అంత్యక్రియలు చేసిన ఘటన శుక్రవారం హరిదాసుపురంలో సంభ వించింది.

భర్తకు భార్య అంత్యక్రియలు
భర్త చితి వద్ద అంత్యక్రియలు చేస్తున్న భార్య తులసమ్మ

నందిగాం, జనవరి 24 (ఆంధ్రజ్యోతి): భర్తకు భార్య అంత్యక్రియలు చేసిన ఘటన శుక్రవారం హరిదాసుపురంలో సంభ వించింది. వివరాలిలా ఉన్నాయి.. గ్రామానికి చెందిన లఖినాన గణపతి గురువారం రైలు ట్రాక్‌ దాటుతుం డగా ప్ర మాదానికి గురై మృతి చెందాడు. మానసిక స్థతి బాగు లేనందున ఈయన ప్రమాదానికి గురయ్యాడు. మృతదేహం గుర్తుతెలి యనదిగా రైల్వే పోలీసులు కేసు నమోదు చేశారు. శుక్రవారం గణపతిగా గుర్తించి హరిదాసుపురంలో అంత్యక్రియలకు సిద్ధం చేశారు. అయితే కుమారుడు సాయి కుమార్‌ విదేశాల్లో ఉండడంతో భార్య తులసమ్మ స్థానిక పెద్ద పైల నేతాజీ తదితరుల సూచనల మేరకు భర్తకు తలకొరివి పెట్టి దహన సంస్కారాలు చేసింది.

Updated Date - Jan 25 , 2025 | 12:12 AM