విభిన్న ప్రతిభావంతుల సంక్షేమంపై దృష్టి: ఏడీ
ABN , Publish Date - Jan 30 , 2025 | 11:56 PM
విభిన్న ప్రతిభా వంతుల సంక్షేమంపై ప్రత్యేక దృష్టిసారిస్తున్నామని విభిన్న ప్రతిభావంతుల సంక్షేమశాఖ జిల్లా అసి స్టెంట్ డైరక్టర్ కొల్లి కవిత తెలిపారు.

పలాసరూరల్, జనవరి30(ఆంధ్రజ్యోతి): విభిన్న ప్రతిభా వంతుల సంక్షేమంపై ప్రత్యేక దృష్టిసారిస్తున్నామని విభిన్న ప్రతిభావంతుల సంక్షేమశాఖ జిల్లా అసి స్టెంట్ డైరక్టర్ కొల్లి కవిత తెలిపారు. గురువారం స్థానిక మండల పరిషత్ కార్యా లయంఆవరణలో ఎంపీడీవో వసంతకుమార్ ఆధ్వర్యంలో ఏఏఐ సహకారంతో విభిన్న ప్రతిభావంతులకు ఉపకరణాలను పంపిణీ చేసేందుకు అర్హత పరీక్షలు నిర్వహించారు.ఈసందర్భంగా 210మంది లబ్ధిదారులు దరఖాస్తులు చేసుకు న్నారని తెలిపారు. కార్యక్రమంలో ఈవోపీఆర్డీ మెట్ట వైకుంఠరావు పాల్గొన్నారు.