Share News

two-wheeler ద్విచక్ర వాహనంలో మంటలు

ABN , Publish Date - Jan 30 , 2025 | 12:31 AM

పట్టణ శివారు లెప్రసీ కాలనీ వద్ద ఉన్న ఓ పెట్రోల్‌ బంకు వద్ద ద్విచక్ర వాహనంలో మంటలు చెలరేగాయి.

two-wheeler ద్విచక్ర వాహనంలో మంటలు
దగ్ధమవుతున్న ద్విచక్ర వాహనం

ఆమదాలవలస, జనవరి 29(ఆంధ్రజ్యోతి): పట్టణ శివారు లెప్రసీ కాలనీ వద్ద ఉన్న ఓ పెట్రోల్‌ బంకు వద్ద ద్విచక్ర వాహనంలో మంటలు చెలరేగాయి. వివరాల్లోకి వెళితే సరుబుజ్జిలి మండలం కొండవలస గ్రామానికి చెందిన అల్లాడ రాజు ఆ బంకులో పెట్రోల్‌ కొట్టించాడు. అనంతరం ద్విక్ర వాహనం స్టార్ట్‌ చేస్తుండగా ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో పెట్రోల్‌ బంకు సిబ్బంది.. అక్కడ ఉన్న మరికొంతమంది ద్విచక్ర వాహనదారులు భయాందోళనతో పరుగులు తీశారు. ఈ క్రమంలో అప్రమత్తమై సిబ్బంది ఆ వాహనాన్ని బంకు బయటకు తీసుకొచ్చి మంటలను అదుపు చేశారు.

Updated Date - Jan 30 , 2025 | 12:31 AM